ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా దాదాపు 1.20 కోట్ల మంది తమకు వచ్చే వ్యాధులకు సరైన వైద్య పరీక్షలు చేయించడం లేదు. ప్రధానంగా తలనొప్పితో బాధపడుతున్న వారి సంఖ్య వీరిలో ఎక్కువగా ఉంది. అయితే మనకు వచ్చే తలనొప్పులు ఎక్కువగా సాధారణమైనవే ఉంటాయి. కానీ కొన్ని పరిస్థితుల్లో వచ్చేవి మాత్రం మైగ్రేన్, బ్రెయిన్ ట్యూమర్ వంటి ముందస్తు అనారోగ్య ప్రమాదాలను సూచిస్తాయి. ఇలాంటి తలనొప్పుల్లో ఏవి ప్రమాదకరంగా ఉంటాయో, ఏవి సాధారణంగా ఉంటాయో మనం అనుభవించే కొన్ని లక్షణాలను జాగ్రత్తగా పరిశీలించడం ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. ఆ లక్షణాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కనుబొమ్మల మధ్యలో లేదా నుదుటిపై వచ్చే తలనొప్పి టెన్షన్ లేదా, సైనస్‌కు సంబంధించిన తలనొప్పిగా ఉంటుంది. తలకు కుడి లేదా ఎడమ భాగాల్లో ఏదైనా ఒక వైపు నొప్పి వస్తే దాన్ని మైగ్రేన్‌గా భావించాలి. కనుగుడ్డు చుట్టూరా వస్తే దాన్ని క్లస్టర్ తలనొప్పిగా భావిస్తారు. ఇలాంటి సందర్భంలో వికారంగా, వాంతికి వచ్చినట్టు కూడా ఉంటుంది. మెదడులో ఏవైనా ట్యూమర్లు ఉన్నా, రక్తస్రావం అవుతున్నా తలనొప్పి వస్తుంది. ఈ తలనొప్పి ఒకేసారి పెద్దపాటి మెరుపులా వస్తుంది. ఇది దాదాపు 60 సెకండ్ల పాటు ఉంటుంది. ఇది భరించలేనంత నొప్పిని కలిగిస్తుంది. కొంతమందికి వ్యాయామం చేసినా, సెక్స్‌లో పాల్గొన్నా తలనొప్పి వస్తుంది. ఇది సాధారణంగా బ్రెయిన్ ట్యూమర్‌కు చెందినదే అయి ఉంటుంది.