వైద్య విజ్ఞానం

నిద్ర మ‌న‌కు ఎందుకు కావాలి.. త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యం..

ఎప్పటికి చిన్నవారుగా కనపడుతూ అందం, ఆరోగ్యం కలిగి వుండాలంటే గొప్ప టానిక్ 6 నుండి 8 గంటల రాత్రి నిద్ర కావాలి. రాత్రి నిద్ర తక్కువైతే, శారీరకంగా, మానసికంగా లోటుగానే భావిస్తాం. అందుకు తగ్గ అనారోగ్యం ఎప్పుడో ఒకప్పుడు తప్పక బయటపడుతుంది. రాత్రి నిద్రలో ఏం జరుగుతుంది? సూర్యుడు అస్తమించంగానే చీకటి పడుతుంది. మన శరీరంలోని పినియల్ గ్రంధి తన పని మొదలుపెట్టి వేగంగా మెలటోనిన్ అనే పదార్ధాన్ని తయారు చేసి రక్తంలో కలిపేస్తూ వుంటుంది. ఇది చీకటిలో మాత్రమే ఈ హార్మోన్ తయారు కావటం వలన దీనిని డ్రాక్యులా హార్మోన్ అని కూడా అంటారు.

ఉదయపు వెలుగు చూసిందా…హార్మోన్ తయారు ఆగిపోతుంది. ఇతర హార్మోన్లు రిలీజ్ అవటం శారీరక చర్యలు మొదలవటం జరుగుతుంది. ఈ రకమైన రోజువారీ విధానం మన శారీరక, మానసిక శక్తులను, ఆరోగ్యాన్ని నియంత్రిస్తుంది. పినియల్ గ్లాండ్, అది తయారు చేసే మెలటోనిన్ హార్మోన్లు శరీరానికి టైమ్ కీపర్స్ లా పని చేస్తాయి. ప్రతిరోజూ సమయాన్ని, సంవత్సరంలో వచ్చే సీజన్లను జీవిత దశను బ్రెయిన్ కు, శరీరానికి అందిస్తాయి. చీకటి పడగానే నిద్రించకుండా వుంటే, మీరు ఈ గడియారాన్ని రీ సెట్ చేసి శరీరంతో ఓవర్ టైమ్ లేదా అధిక పని చేయిస్తున్నట్లే. దాని సమర్ధతను తగ్గిస్తున్నట్లే. శ‌రీరం అవసరమైన రసాయనాల అసమతుల్యత పొందటమే కాదు మరల కోలుకోలేని రీతిలో త్వరగా ముసలిదైపోతుంది.

why do we require sleep must know this

మెలటోనిన్ శరీరంలోని అంతర్గత ప్రక్రియలను సమన్వయం చేస్తుంది. నిద్ర అనేది మనసుకే కాదు శరీరానికి కూడా కావాలి. ఒక మనిషి నిద్రిస్తున్నాడంటే, మనసు, శరీరం రెండూ కూడా అతను మెళకువగా వున్నపుడు ఎంత పని చేస్తాయో, నిద్రిస్తున్నపుడు కూడా అంతపని చేస్తాయి. రసాయనాల అసమతుల్యత, వ్యాధినిరోధకత, మరుసటి రోజుకు అవసరమైన బ్లడ్ షుగర్ స్ధాయి, మెమోరీలను నిర్వహించడం చేస్తాయి. లేట్ గా నిద్రించే వారందరకు ఈ పనులు చేసే మెలటోనిన్ కావలసిన రీతిలో తయారు కాదు. వెలుగు కిటికీ నుండి లేదా బల్బు నుండి ఏ కొద్దిగా పడినా సరే మెలటోనిన్ తయారీ సరైన స్ధాయిలో వుండదు. కనుక 6 నుండి 8 గంటలు పూర్తి చీకటిలో నిద్రించటం ఆరోగ్యానికి ఎప్పటికి చిన్నగా కనపడటానికి అత్యవసరం.

Admin

Recent Posts