వైద్య విజ్ఞానం

మ‌రి కొద్ది నిమిషాల్లో మీకు గుండె నొప్పి వ‌స్తుంద‌న‌గా ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి..

నేటి రోజుల్లో గుండె సంబంధిత వ్యాధులు చిన్న వయసులలోనే వచ్చేస్తున్నాయి. ప్రత్యేకించి మహిళలు తమ హృదయాలతో ఆలోచిస్తారని కార్డియాలజిస్టులు చెపుతూంటారు. దీంతో వారికి ఒత్తిడి, నొప్పి వంటివి తప్పక వస్తూంటాయి. మరి అటువంటపుడు గుండె కొట్టుకోవడంలో కూడా తేడాలొచ్చేస్తాయి. 26 సంవత్సరాల వయసున్న వారు కూడా గుండె పోట్ల బారిన పడుతున్నారని వైద్యులు చెపుతున్నారు. మారుతున్న సమాజం దీనికి కారణమంటారు.

మహిళలు గతంలో ఇంటిపనికి మాత్రమే అంటిపెట్టుకుని వుండే వారని, నేటిరోజుల్లో వారు వివిధ రకాల ఉద్యోగాలు, వ్యాపకాలు ఆచరిస్తున్నారని ప్రత్యేకించి గుండెపోట్లు, మెనోపాజ్ దశలోకి చేరుతున్న మహిళలను లక్ష్యం చేస్తున్నాయని వీరు వెల్లడించారు. కుటుంబ చరిత్ర, ఒత్తిడి, కాలుష్యం, రక్తపోటు, డయాబెటీస్, కొల్లెస్టరాల్ వంటివి ప్రధానంగా చిన్నవయసు వారిలో గుండెపోట్లు కలిగిస్తున్నాయి. మహిళలు తప్పక తమ జీవన విధానం మార్చుకోవాలని వ్యాయామాలు, నియమిత ఆహారం, ధ్యానం వంటివి తప్పక చేయాలని, మెనోపాజ్ దశకు చేరుతున్నవారు, తప్పక సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి.

you will see these signs and symptoms before you get heart attack in minutes

గుండెపోటు వచ్చే లక్షణాలు ఎలా? ఛాతీలో వస్తూ, పోతూ వుండే అసౌకర్యం. లేదా కొద్ది నిమిషాలుండి పోయేది. శరీర పైభాగంలో నొప్పి లేదా వీపు, మెడ, దవడ, పొట్ట, ఒక చేయి లేదా రెండు చేతులలోను నొప్పి లేదా అసౌకర్యం.ఛాతీ నొప్పి కలిగి లేదా నొప్పి లేకుండా శ్వాస మందగించటం, చెమటలు పట్టడం, వికారం, కొద్దిపాటి తలనొప్పి వంటివి గుండెపోటు వచ్చేటందుకు చిహ్నాలుగా కనపడతాయి.

Admin

Recent Posts