mythology

బింబిసారుడు దాచిన బంగారం ఎక్కడుందో తెలుసా..? ఆ ద్వారం తెరిస్తే మన దేశం దశ మారినట్టే..!

భారతదేశం అపారమైన సంపద కలిగి దేశం..అందుకే దీనిని గతంలో బంగారు పక్షి అని పిలిచేవారు. కానీ, ఏళ్ల తరబడి పరాయి పాలనలో ఉండటం వల్ల మన దేశ సంపద ఎక్కువ భాగం దోపిడీకి గురైందని చెబుతారు. అయినప్పటికీ భారతదేశం ఇప్పటికీ బలంమైన దేశంగానే ఉంది. దేశంలో చాలా ప్రాంతాల్లో నిధి నిక్షేపాలు దాగివున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. అవన్నీ నేటికి అంతుచిక్కని రహస్యంగానే ఉన్నాయని చెబుతున్నారు. అలాంటి నిధి ఉన్న ప్రాంతం బీహార్‌లో కూడా ఉంది. బీహార్‌లోని రాజ్‌గిర్‌లో ఉన్న సోన్ భండార్ గుహలో వేల సంవత్సరాల నాటి స్వర్ణబండాగారం దాగి ఉందని చెబుతున్నారు. ఈ నిధి మగధ చక్రవర్తి బింబిసారుడికి చెందినదని పురాణాలు చెబుతున్నాయి. దీనిని బ్రిటిష్ వారు కూడా గుర్తించలేకపోయారట. పూర్తి వివరాల్లోకి వెళితే…

రాజ్‌గిర్ చరిత్ర చాలా పురాతనమైనది. సోన్‌ భండార్‌ గుహలో ఉన్న నిధి మగధ చక్రవర్తి బింబిసారుడికి చెందినదని, అతడు తన భార్య సలహా మేరకు బంగారాన్ని అక్కడ గుహలో దాచిపెట్టాడని చరిత్రకారులు చెబుతున్నారు. బింబిసారుడికి బంగారం, ఆభరణాలంటే చాలా ఇష్టం. అతని కుమారుడు అజాతశత్రువు అతన్ని బంధించినప్పుడు, అతని భార్య ఈ గుహలో నిధినంతా దాచిపెట్టరట. అది నేటికీ రహస్యంగానే ఉందని చెబుతారు. ఈ గుహ రహస్యం బింబిసారుడికి మాత్రమే తెలుసు.

bimbisara cave where he stored all of his gold

ఆ గుహ లోపల ఒక చిన్న గది ఉందని, అందులో సైనికులు నివసించేవారని చెబుతారు. ఆ గది వెనుక భాగంలో బింబిసారుడు దాచిన నిధి గది ఉంటుందట.. అది నేటికీ ఒక భారీ రాయితో మూసివేయబడి ఉంటుందట. ఆ రాయిపై శంఖ లిపిలో ఏదో రాసి ఉంది. దానిని చదవగలిగినవాడు మాత్రమే ఆ నిధిని చేరుకోగలడని నమ్ముతారు. కానీ ఇప్పటివరకు ఎవరూ ఇందులో విజయం సాధించలేదు. బ్రిటిష్ వారు ఫిరంగులతో గుహను పేల్చివేయడానికి ప్రయత్నించారు. కానీ గుహలోనికి వెళ్లలేకపోయారు. నేటికీ గుహపై ఫిరంగి గుర్తులు ఉన్నాయని అక్కడి వెళ్లినవారు చెబుతున్నారు.

సోన్‌ భండార్ కు సంబంధించి మహాభారత కాలం నాటి కథలు కూడా ఉన్నాయి. వాయు పురాణంలో కూడా జరాసంధుడు ఇక్కడ నిధిని దాచిపెట్టాడని పేర్కొన్నారు. జరాసంధుని వధ అనంతరం అతని సంపదనంతా అక్కడి గుహలోనే దాచిపెట్టారని చెబుతారు. నేటి వరకు ఎవరూ ఈ నిధిని చేరుకోలేకపోయారు. ఈ గుహకు సంబంధిచి అనేక కథలు ప్రచారంలో ఉండటంతో రాజ్‌గిర్‌కు వచ్చే ప్రజలు, పర్యాటకులు ఖచ్చితంగా ఈ మర్మమైన గుహను సందర్శిస్తారు.

Admin

Recent Posts