mythology

రావ‌ణాసురుడికి చెందిన ఈ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు మీకు తెలుసా..?

రావణుడు సీతను అపహరించాడని ఎప్పుడూ చెబుతూ ఉంటాం. అయితే జైనుల సిద్ధాంతం ప్రకారం రామాయణంలో రావణుడు సీత తండ్రి అట. ఇదో ఆశ్చర్యకర విషయమే కదా. పది తలలు ఉండటం వల్ల రావణుడిని దశగ్రీవ అని పిలుస్తారు. ఇది అతని గొప్ప తెలివి తేటలని సూచిస్తుంది. అంతేకాదు.. రావణుడు విద్యకు చాలా ప్రాధాన్యత ఇచ్చేవాడట. రావణుడు సైన్స్, మెడిసిన్స్ స్కాలరట. ఎందుకంటే.. ఆ కాలంలోనే అతను పుష్పక విమానంలో తిరిగేవాడు. దీన్ని బట్టి రావణాసురుడికి సైన్స్ పై ఉన్న మక్కువ తెలుస్తోంది. రావణుడికి నగలు, బట్టలు అంటే చెప్పుకోలేని అభిరుచి ఉండేదని తెలుస్తోంది. అలాగే అతను చాలా అందంగా ఉండేవాడని పురాణాలు చెబుతున్నాయి.

భారతదేశంలో శాస్త్రీయ పరికరాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగినది రుద్రవీణ. దీన్ని రావణుడే కనిపెట్టారని మీకు తెలుసా. రావణుడు కులానికి వ్యతిరేకం. అతను కులాల‌ పట్టింపులు పాటించలేదని పురాణాలు చెబుతున్నాయి. రావణాసురుడు జ్యోతిష్యంలో గొప్ప నిష్ణాతుడట. ఆయనను మాస్టర్ ఆస్ట్రాలజర్ అని పిలుస్తారు. రావణుడికి రకరకాల పేర్లున్నాయి. అందులో ఒకటి దశానన్. రావణుడు మంచి సోదరుడిగా, ఆదర్శ భర్తగా గుర్తింపు పొందాడు. రావణాసురుడు గొప్ప శివ భక్తుడు. రాత్రి, పగలు శివుడిని అమితంగా పూజించేవాడట. హనుమంతుడి బలగం రావణుడి భార్య మండోదరితో అసభ్యంగా ప్రవర్తించిందని రామాయణంలోని కొన్ని సంస్కరణలు వివరిస్తున్నాయి. కానీ.. రావడణుడు ఎలాంటి అగ్నిపరీక్ష పెట్టకుండా.. ఆమెను అంగీకరించాడని చెబుతాయి.

do you know these interesting facts about lord ravana

రాముడికి ముల్లోకాల్లోనూ భక్తులున్నారు. ఆయన్ని దేవుడిగా పూజిస్తారని తెలుసు. కానీ.. రాముడితో పోరాడిన రావణుడికి కూడా భక్తులున్నారంటే నమ్ముతారా ? నిజమే భారతదేశంలోనూ, శ్రీలంక లోని కొన్ని ప్రాంతాల్లో రావణుడిని దేవుడిగా పూజిస్తారట.

Admin

Recent Posts