mythology

కొండ చివ‌ర‌న ఈ భారీ రాయి.. ప‌డిపోకుండా అలాగే ఉంది.. ఎక్క‌డంటే..?

భారతదేశం సహజమైన అద్భుతాలకు నెలవు. ఈ నేలపై ఎన్నో ఆద్యాత్మికతకు సంబంధించి..సైన్సుకే అందని మిస్టరీలు దాగున్నాయ. అలాంటి వాటిలో ఒకటి..కృష్ణుడి బటర్‌బాల్‌గా పిలిచే వెన్నబంతి. ఇదెక్కడ ఉంది..?. దాని కథా కమామీషు గురించి సవివరంగా చూద్దామా..! తమిళనాడు రాష్ట్రం అద్భుతమైన దేవాలయాలకు ప్రసిద్థి. ఆ దేవాలయ శిల్పకళా సంపద పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. ఆ రాష్ట్రానికి హృదయంగా పిలిచే మహాబలిపురం పురాతన శిల్పకళ, రాతి గుహలు, ఏకశిల నిర్మాణాలకు ప్రసిద్ధిగాంచిన పట్టణం. అక్కడ అన్నింట్లకంటే ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది కృష్ణుడి బటర్‌బాల్‌. ఇది మేథావులకు, శాస్త్రవేత్తలకు ఓ పట్టాన అర్థం కాని చిక్కుప్రశ్నలా మిగిలింది. ఎందుకంటే..

యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన ఈ బండరాయిలాంటి వెన్నముద్ద 45 డిగ్రీల నిటారు కొండ వాలుపై ఉండటం విశేషం. పైగా ఇది 250 టన్నుల భారీ బండరాయి. అయినా అంత వాలులో ఏదో గమ్‌ లేదా ఆయస్కాంత మాదిరిగా అతుక్కుపోయినట్లుగా ఉంటుంది. గత 12 వందల ఏళ్లల్లో ఒక్క ఇంచు దాని ప్రదేశం నుంచి కదలకపోడం మరింత ఆశ్చర్యకరమైన అంశం. చెప్పాలంటే అక్కడ గురుత్వాకర్షణ పనిచేస్తుందా అనే సందేహం వస్తుంది. ఎందుకంటే అంత భారీ బండరాయి ఏటావాలుగా ఉన్నవైపు నుంచి అమాంతం పడిపోతుంది. కానీ ఇది మాత్రం ఏదో మ్యాజిక్‌ చేసినట్లుగా నిలబడి ఉంటుంది. ఈ భారీ గ్రానైట్‌ రాయి గణేష్ రథం సమీపంలోని ఒక చిన్న కొండ వాలుపై ఉంది. ఇది సుమారు ఆరు మీటర్ల ఎత్తు, ఐదు మీటర్ల వెడల్పు ఉంటుంది. హిందూ పురాణాల ప్రకారం..కృష్ణుడికి ఇష్టమైన వెన్న ముద్ద ఆకృతిలో ఉంటుంది ఈ శిల. అందుకే దీనికి కృష్ణుడి బటర్‌ బాల్‌ లేదా వెన్నబంతి అనే పేరొచ్చింది.

have you seen krishna butter ball in this state

పల్లవ రాజు నరసింహవర్మన్ I ఏనుగులతో ఈ గ్రానైట్ బండరాయిని తరలించడానికి ప్రయత్నించాడు. ఒక్క ఇంచు కూడా కదపలేక విఫలమయ్యాడు. అలాగే 1908లో, మద్రాస్ గవర్నర్ ఆర్థర్ లాలీ ​కొండ నుంచి రాతిని తొలగించేందుకు ప్రయత్నించాడు. ఆయన 42 టన్నులను అవలీలగా లాగే ఏడు ఏనుగులను తీసుకొచ్చాడు, కానీ ఫలితం శూన్యం. కృష్ణుడి బటర్ బాల్ అనేది ఎక్స్‌ఫోలియేషన్‌కి సంబంధించిన అరుదైన భౌగోళిక సంఘటనగా శాస్త్రవేత్తలు విశ్వసిస్తారు. శతాబ్దాలుగా గాలి, అగ్ని, నీరు తదితరాలేవి దాన్ని కదలించడం లేదా గాట్లు పడటం వంటివి చేయలేకపోయాయి. ఇది గ్నిస్‌ అనే ప్రత్యేకమైన గ్రానైట్‌తో నిర్మితమైనదని, అందువల్ల ఏది దీని ఆకారాన్ని పాడు చేయలేనంత దృఢంగా ఉంటుందని వెల్లడించారు.

శిల ఆకారం, కొండ వాలు మధ్య సహజ ఆకర్షణ అది పడిపోకుండా ప్రత్యేకంగా ఉండటానికి దోహదం చేసిందనేది శాస్త్రవేత్తల అభిప్రాయం. ఇంకెందుకు ఆలస్యం ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ కృష్ణుడి వెన్నబంతిని తప్పక సందర్శంచండి మరీ..!.

Admin

Recent Posts