mythology

కామ‌సూత్ర అంటే బూతు పుస్త‌కం కాదు.. ఆధ్యాత్మిక గ్రంథం..

చాలా ధార్మిక సంఘాల్లో శృంగారం అనేది చాలా వివాదాస్పద అంశం. ఆధ్యాత్మిక ప్రపంచాన్ని కోరుకునేవారికి శృంగారం, ప్రణయం అవరోధాలని ప్రధాన మతాలు అన్నీ బోధిస్తాయి. మరో వంక ఈ మతాలలోనే పరమాత్మను కనుగొనడానికి ఇదే ముఖ్యమైన మార్గమని భావించే వర్గాలు కూడా వున్నాయి. భారతీయ సందర్భంలో శృంగారాన్ని గురించి మాట్లాడుకున్నప్పుడు ముందుగా మనసులో మెదిలేది కామ సూత్ర. చాలా మంది దాన్ని రతి భంగిమలు, బూతు బొమ్మలు ఉండే పుస్తకంగా భావిస్తారు. కానీ ఎలా చూసినా కామ సూత్ర బూతు బొమ్మల పుస్తకం కాదు. ఆ పుస్తకంలోని అసలు పరమార్ధం భౌతిక వాదం కన్నా ఉన్నతమైనది. పునరుత్పత్తి, సృష్టి చేసే పవిత్ర కార్యం శృంగారం. విశ్వంలోని ప్రకృతి, పురుష శక్తుల కలయిక అది. ఒక నాగరిక వ్యక్తిని ప్రేమ, శృంగారం, జీవితపు సంతోషాల వైపు మార్గదర్శనం చేసి నడిపిస్తుంది కామసూత్ర.

అందులోని 64 కళలు ఒక మంచి భార్యకు మార్గదర్శనం చేయడమే కాదు, ఒక సంస్కారవంతమైన, నిపుణురాలు, అర్ధం చేసుకునేది, అందమైనది, తెలివిగలది అయిన నాగరిక మహిళకు మార్గదర్శనం చేస్తుంది. జంతువులలో శృంగార ప్రక్రియ కేవలం జీవ సృష్టికే పరిమితం అవుతుంది. అయితే, మానవులలో మాత్రం అన్ని స్థాయిలలో – శారీర‌క, మానసిక, స్థాయిల్లో కూడా సృష్టికి పనికి వస్తాయి. అందువల్ల, మనం ఎప్పుడైనా ఆకర్షణ, ఉద్దీపన, జాగరణ, తీవ్రేచ్చ, ఆసక్తి, ఉత్సాహం లేదా సృజనాత్మకత అనుభవించితే అది శృంగార శక్తి వల్లనే. కామసూత్ర ఈ శక్తిని శ్రద్ధగా, ఉత్సాహంతో పెంపొందించి ఉత్తమ లక్ష్యాల వైపు ఎలా వ్నియోగించాలో కామసూత్ర నేర్పిస్తుంది. కామసూత్ర గ్రంథాన్ని వేదాల ఆధారంగా రూపొందించారని చెప్తారు. కామసూత్ర గ్రంధంలోని మొదటి సూత్రాన్ని శివుడి వాహనం నంది కి అంకితం చేసారు. తరువాత క్రీ.శ. ఒకటో శతాబ్దానికి ఆరో శతాబ్దానికి మధ్య దాన్ని వాత్సాయన మహర్షి కామసూత్రాలుగా రాశారు.

kamasutra is a religious book

ఇక్కడ గమనించాల్సిన ఆసక్తికరమైన అంశం ఏమిటంటే మానవ జీవితానికి సంబంధించిన మూడు పురాతన గ్రంథాల్లో కామసూత్ర ఒకటి. నైతికత గురించి చెప్పే ధర్మశాస్త్రం, ఐహిక ఆర్ధిక విషయాలను గురించి చెప్పే అర్ధ శాస్త్రం మిగిలిన రెండు గ్రంథాలు. కామాన్ని జీవితంలోని మూడో పరమార్ధంగా చెప్తారు. కామం అంటే వినడ౦, అనుభవించడ౦, చూడడం, రుచి, వాసన చూడడానికి ఉపయోగపడే జ్ఞానేన్ద్రియాలతో పాటు మనసు, ఆత్మ కలిసి ఆయా వస్తువులను ఆస్వాదించడం అని నిర్వచించారు. రతి కలయికలో శరీరం, ఆత్మ సంగమిస్తాయి. అందువల్ల ఆ కోరిక పవిత్రంగా వుంటుంది. సరదాల ద్వారా కూడా ఆధ్యాత్మిక అనుభూతిని అందించేలా వ్యక్తులకు మార్గదర్శనం చేస్తుంది కామసూత్ర. అవసరం బదులు, సరదా వుంటే రతి క్రీడ ఆనందాన్ని కలిగిస్తుంది. అందువల్ల తనలోని శృంగారపరమైన అవసరాలను అణిచి పెట్టి వుంచుకున్న వారిలో మానసిక సంఘర్షణ కలిగి, చివరికి జీవితంలో అసంతృప్తికి దారి తీస్తుంది.

ఆధ్యాత్మిక గురు దీపక్ చోప్రా చెప్పినట్లు – శృంగారం, బలహీనత, పెడధోరణులు , శృంగారంలో విపరీత ధోరణులు, హింస, దుర్వినియోగం లాంటివి శృంగార వాంచల వల్ల కాక వాటిని అణిచివుంచడం, వ్యతిరేకత లాంటి వాటి వల్ల కలుగుతాయి. ఎటువంటి బిడియం, సంకోచం లేకుండా మన కోరికలు తీర్చుకునే అవకాశం వుంటే అవి తీవ్ర రూపం దాల్చవు. ఏ రూపంలోనైనా విపరీత ధోరణి బిడియం, అణచివేత లకు మరో రూపం మాత్రమే. దూకుడు, హింస అనేవి భయానికి, అసమర్ధతకు నీడ లాంటి శక్తులు. అత్యంత ఆశ్చర్యకరమైన ఈ పుస్తకాన్ని మరింత శోది౦చేకొద్దీ ప్రతి శృంగార భంగిమకూ ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక పరమార్ధం వుందని అర్ధం అవుతుంది. అందువల్ల మనం ఇన్నాళ్ళూ ఊహించిన దానికన్నా కామసూత్ర చాలా భిన్నమైనది. అయితే ఆనందం అనే మరో కోణం నుంచి దీన్ని చూసి ఆనందించాలి అంతే. ఆ విధంగానే మీరు చివరికి ఆధ్యాత్మికతను అనుభవించగలరు.

Admin

Recent Posts