mythology

సుగ్రీవుడి భార్యను వాలి నిజంగా కోరుకున్నాడా?

సుగ్రీవుడి భార్యను వాలి నిజంగా కోరుకున్నాడా? కోరుకోడానికి కారణం ఏంటి? వాలి చనిపోయిన తర్వాత సుగ్రీవుడు తారని పెళ్లి చేసుకున్నాడు? అది తప్పు కాదా? వాలి మహా బలవంతుడు, ఆవేశపరుడు. ఇంద్రుని అనుగ్రహంతో పుట్టినవాడు. ఈ కారణాల చేత గర్వం, అహం కూడా ఎక్కువే. వాలి శత్రువుల మీద కి వెళ్ళినప్పుడు సుగ్రీవుడు కూడా వెళ్ళేవాడు. ఆయన కూడా తక్కువేం కాదు. సూర్యుని అనుగ్రహం వల్ల పుట్టిన వీరుడు. ఒకసారి అలాగే ఒక రాక్షసుని మీద యుద్దానికి వెళ్ళాడు వాలి, వెనకే సుగ్రీవుడు. ఆ రాక్షసుని గుహలో కి వెళ్తూ సుగ్రీవుడిని బయట వేచి ఉండమన్నాడు…ఎంత కాలమైనా వాలి రాలేదు. ఇంతలో గుహ నుంచి అన్నగారి ఆర్తనదాలు వినిపించాయి. అన్న పోయాడ‌నుకుని రాక్షసుడు బయటకి రాకుండా గుహ కి రాయి అడ్డు పెట్టి సుగ్రీవుడు వచ్చి రాజ్యపాలన చేస్తున్నాడు. తార‌ కూడా అతనితో ఉంది అప్పుడు.

వాలి తిరిగి వచ్చాడు. సుగ్రీవుడు మోసం చేశాడునుకున్నాడు. కానీ ఇక్కడే కొన్ని ప్రశ్నలు వస్తాయి…. వాలి ఎందుకు అంత గొడవ చెయ్యడం నా తమ్ముడే కదా అనుకోవచ్చు కదా…లేదు మోసం చేశాడని సుగ్రీవుడికి శిక్ష వెయ్యాలి అంటే సరైన విచారణ చేసి అప్పుడు శిక్ష వెయ్యాలి. పోనీ ఆవేశంలో అదేం చెయ్యలేదు. సుగ్రీవుడు అన్నకి సింహాసనము ఇచ్చేసాడు…రాజుగా తప్పుకున్నాడు. అప్పుడు ఇంక సుగ్రీవుడిని వదిలెయ్యాలి. రాజ్య బహిష్కరణ చేశాడు. భార్యని మాత్రం తన దగ్గరే పెట్టుకున్నాడు. తమ్ముడు బతికే ఉండగా, బతికే వున్నాడని తెలిసి కూడా అతని భార్యని తన భార్యలా చేసుకున్నాడు. అక్కడితో కూడా అవ్వలేదు… చంపెయ్యాలి అనుకుని భూమండలం అంతా పరిగెత్తించాడు. చివరికి రూష్యమూక పర్వతం మీదకి శాపం కారణంగా వాలి రాలేడు అని అక్కడ తలదాచుకున్నారు సుగ్రీవుడు అతని పరివారం. తరవాత కథ మనకి తెలిసిందే.

what is the story of vali and sugriva

వానరుల్లో భర్త చనిపోతే అతని సోదరుడిని వివాహం చేసుకోవచ్చు….. అదొక సంప్రదాయం ఉంది వాళ్ళకి. కనుక తార సుగ్రీవునితో వున్న సమయంలో ఆమె భర్త ప్రాణాలతో లేడు. (మొదటి సారి బతికి ఉన్నట్టు తెలీదు). పైగా తార కూడా దానికి ఒప్పుకుంది. ఇక్కడ రుమకి సుగ్రీవుడు బతికే వున్నాడు అని తెలిసి అలా ఇంకో పురుషునితో ఉండడం ఇష్టం కాదు కదా.

Admin

Recent Posts