వినోదం

తొడ కొడితే ట్రైన్ ఆగిపోవడమేంటీ..? మరీ టూమచ్ అని స్వయంగా బాలకృష్ణే తన సినిమాపై సెటైర్ వేశారు.!

బాలకృష్ణ అనగానే కత్తులతో కాదు కంటి చూపుతో చంపేస్తా ల్లాంటి పవర్ ఫుల్ డైలాగులు గుర్తుకువస్తాయ్. ఇక తొడకొడితే ట్రైన్ ఆగిపోవడాలు, వేలు చూపిస్తే వచ్చిన ట్రైన్ వచ్చినట్టే వెనక్కిపోయే సీన్లు కూడా కళ్ళముందు కదులుతాయ్. అయితే అవే సీన్లపై బాలకృష్ణే స్వయంగా సెటైర్లు వేసుకున్నారు. చీ కామెడీగా లేదు, తొడ కొడితే ట్రైన్ ఆగిపోవడమేంటి..? అని తన ఫీలింగ్స్ ను చెప్పేశారు. పల్నాటి బ్రహ్మనాయుడు సినిమాలో అప్పుడేదో క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయ్యి అలా చేశాను కానీ….అప్పుడప్పుడు నాకూ కొంచెం ఇదిగా అనిపిస్తుందని అన్నారు బాలకృష్ణ. ఆ సీన్ మరీ అంత టూమచ్ గా ఉందంటూ చెప్పుకొచ్చారు బాలయ్య బాబు.

తానేనెందుకు చేశానో డైరెక్టర్ ఎందుకు చెప్పారో తెలియదు కానీ అప్పుడప్పుడు కొంచెం ఇదిగా అనిపిస్తుందన్నారు. దీనితో పాటు బాలకృష్ణ చుట్ట మీద సీసపద్యం కూడా చెప్పారు. తనకు చుట్టతాగడం అలవాటని…నాన్నగారు కూడా రోజూ చుట్ట తాగేవారని తెలిపారు. ఆదిత్య 369 కు సీక్వెల్ అయిన ఆదిత్య 999 లో తన కుమారుడు మోక్షజ్ఞతో కలిసి నటిస్తున్న‌ట్లు తెలిపారు బాలయ్య బాబు.

balakrishna did comedy on himself

ఇక బాల‌కృష్ణ న‌టించిన డాకు మ‌హారాజ్ ఈ మ‌ధ్యే రిలీజ్ అయి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న తాజాగా కేంద్రం నుంచి ప‌ద్మ విభూష‌ణ్ అవార్డును కూడా పొందారు. ఓ వైపు సినిమాల్లో న‌టిస్తూనే మ‌రో వైపు పాలిటిక్స్‌లోనూ చురుగ్గా ఉన్నారు బాల‌య్య‌.

Admin

Recent Posts