Bheemla Nayak : ఓటీటీలో ర‌చ్చ చేస్తున్న భీమ్లా నాయ‌క్‌.. పండ‌గ చేసుకుంటున్న ప‌వ‌న్ ఫ్యాన్స్‌..!

Bheemla Nayak : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్, ద‌గ్గుబాటి రానాలు ప్ర‌ధాన పాత్ర‌ల్లో వ‌చ్చిన చిత్రం.. భీమ్లా నాయ‌క్‌. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న విజ‌యం సాధించింది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వ‌చ్చేసింది. గురువారం నుంచి ఈ మూవీ రెండు ఓటీటీ యాప్‌ల‌లో స్ట్రీమ్ అవుతోంది. ఆహాతోపాటు డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ యాప్‌లోనూ ఈ మూవీని స్ట్రీమ్ చేస్తున్నారు. దీంతో ప‌వ‌న్ అభిమానులు పండ‌గ చేసుకుంటున్నారు. సినిమా విడుద‌లైన స‌రిగ్గా నెల రోజుల‌కు ఓటీటీలోకి రావ‌డం విశేషం.

Bheemla Nayak released on OTT apps good news for Pawan Kalyan fans
Bheemla Nayak

అయితే ఈ మూవీని ముందుగా శుక్ర‌వారం మార్చి 25వ తేదీన ఓటీటీలో విడుద‌ల చేయాల‌ని అనుకున్నారు. కానీ అదే రోజు ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ ఉంది. దీంతో ఆ మూవీతో క్లాష్ ఎందుక‌ని చెప్పి ఒక్క రోజు ముందుగానే భీమ్లా నాయ‌క్‌ను ఓటీటీల్లో విడుద‌ల చేశారు. ఇక ఇందులో ప‌వ‌న్ ప‌క్క‌న నిత్యా మీన‌న్ న‌టించ‌గా.. రానా ప‌క్క‌న సంయుక్త మీన‌న్ న‌టించింది.

ఇక ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాల విష‌యానికి వ‌స్తే ఈయ‌న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు అనే చిత్రం షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. అలాగే సాయి ధ‌ర‌మ్ తేజ్‌తో క‌లిసి ఓ సినిమా చేయ‌నున్నారు. రిప‌బ్లిక్ మూవీ త‌రువాత సాయి ధ‌ర‌మ్ తేజ్ చేస్తున్న చిత్రం కావ‌డంతో ప్రాధాన్య‌త ఏర్ప‌డింది. ఆ మూవీ విడుద‌ల స‌మ‌యంలో తేజ్ హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ మ‌ధ్యే పూర్తిగా కోలుకుని బ‌య‌ట కనిపిస్తున్నాడు.

Editor

Recent Posts