Radhe Shyam : రాధే శ్యామ్ మూవీ.. ఏకంగా 3 ఓటీటీల్లో..!

Radhe Shyam : ప్ర‌భాస్‌, పూజా హెగ్డెలు హీరో, హీరోయిన్లుగా వస్తున్న లేటెస్ట్ చిత్రం.. రాధేశ్యామ్. ఈ సినిమా ఈ నెల 11వ తేదీన థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అందులో భాగంగానే మేక‌ర్స్ ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను వేగ‌వంతం చేశారు. ఇక ఇటీవ‌లే ముంబైలో ఇందుకు గాను ఓ ఈవెంట్‌ను కూడా నిర్వ‌హించారు. అందులో సినిమా రిలీజ్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఇక ఆ ఈవెంట్ అనంత‌రం నిర్వ‌హించిన స‌మావేశంలో ప్ర‌భాస్ అనేక ప్ర‌శ్న‌ల‌కు ఓపిగ్గా స‌మాధానాలు చెప్పారు.

Radhe Shyam movie may stream on 3 OTT platforms
Radhe Shyam

కాగా రాధేశ్యామ్ సినిమాకు ఇప్ప‌టికే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగిన‌ట్లు స‌మాచారం. అందులో డిజిట‌ల్ హ‌క్కుల విష‌యానికి వ‌స్తే.. అమెజాన్ ప్రైమ్ తెలుగు హ‌క్కుల‌ను కొనుగోలు చేసింద‌ని తెలుస్తోంది. ద‌క్షిణాది భాష‌ల‌కు చెందిన డిజిట‌ల్ హక్కుల‌ను జీ5, హిందీ హ‌క్కుల‌ను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసిన‌ట్లు తెలుస్తోంది. దీంతో మొత్తం 3 ఓటీటీల్లో ఈ సినిమా స్ట్రీమ్ కానున్న‌ట్లు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఈ విష‌యాల‌పై స్ప‌ష్టత రానుంది.

ఇక రాధేశ్యామ్ సినిమాకు రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. యూవీ క్రియేష‌న్స్ నిర్మించింది. ల‌వ్ డ్రామా జోన‌ర్‌లో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో ప్ర‌భాస్ విక్ర‌మాదిత్య‌గా.. హ‌స్త సాముద్రికుడి పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా విడుద‌ల కావ‌ల్సి ఉండ‌గా.. అనేక కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ఎట్ట‌కేల‌కు మార్చి 11వ తేదీన.. అంటే.. సరిగ్గా ఇంకో వారం రోజుల్లో ఈ మూవీ విడుద‌ల కానుంది.

Editor

Recent Posts