పోష‌ణ‌

ప‌చ్చి అర‌టికాయ‌ను తింటే ఇన్ని ఉప‌యోగాలు ఉన్నాయా..?

పూర్వం మన సంప్రదాయాలలో అరిటాకు లేని భోజనం, అరటిపండు ఇవ్వని పండుగలు, ఫంక్షన్ లు ఉండేవి కావు అంటే అతిశయోక్తి కాదు. కారణం అరిటాకు లో భోజనం చేయడంవల్ల తినే పదార్థాలలో ఏమైనా రసాయనాలును వుంటే.. వాటిని తొలగించే గుణం ఈ అరిటాకుకు ఉంటుంది. దీనికి ఉదాహరణ మనము ఎప్పుడైనా టిఫిన్ కానీ, భోజనం కానీ అరిటాకు లో వడ్డించినప్పుడు అందులో ఏమైనా కల్తీ వుంటే అరిటాకు నల్లబడుతుంది. లేకుంటే అరిటాకు ఆకుపచ్చ రంగులోనే వుంటే అందులో కల్తీ లేనట్టే అని గుర్తుంచుకోండి.

ఇక పండ్ల విషయానికి వస్తే.. పండిన అరటిపండునే కాక పచ్చి అరటికాయ వలన కూడా చాలా ఆరోగ్య లాభాలుంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.పచ్చి అరటికాయలో కాల్షియం,ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం, జింక్ మొదలైనవి ఉంటాయి. ఈ కారణంగా ఇది శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది.భోజనం లో పచ్చి అరటికాయతో చేసిన వంటను చేర్చుకోవడం వల్ల బరువు తగ్గడానికి చాలా మంచి ఆహారం. ఇందులో పీచుపదార్థం ఉండటంతో త్వరగా ఆకలి అవదు. ఎక్కువగా తినాలనే కోరిక తగ్గుతుంది.పచ్చి అరటి వృద్ధాప్యాన్ని నిరోధించే ఆహారం. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు ఉంటాయి. ఇవి శరీరంలోని ముడతలను తగ్గిస్తాయి.ఇందులో ఉండే మెగ్నీషియం వల్ల కీళ్ల నొప్పులు, కండరాలు నొప్పి తగ్గించడానికి దోహదం చేస్తుంది.

curry banana and its many wonderful health benefits

పచ్చి అరటికాయ లో ఉండే వగరు వల్ల తినే ఆహారంలో ఉండే విటమిన్స్, మినరల్స్ ను తొందరగా శరీరం అబ్జర్బ్ చేసుకుంటుంది. రోజూ ఒక పూట లో అరటి కాయ‌ తో చేసిన పదార్థాలను తీసుకోవడం వల్ల గుండె పనితీరు మెరుగుపడి రక్తం బాగా శుభ్రపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ వల్ల జీర్ణసమస్య లు తొలగి మలబద్దకం రాకుండా చేస్తుంది.పచ్చి అరటికాయ‌లో మధుమేహ నిరోధక లక్షణాలు ఉన్నాయి.అలాగే రక్తంలో చక్కర స్థాయిలను క్రమ బద్దీకరిస్తుంది. పచ్చి అరటికాయ‌ తో వేపుడు, బజ్జీ లు, సాంబారు చేసుకొని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడంవల్ల ఎన్నో ఆరోగ్యప్రయోజనాలున్నాయి.

Admin

Recent Posts