ఇప్పుడు వాటికి ఉన్న డిమాండ్ మాములుగా లేదు. రోజూ తినొచ్చు. బలగం సినిమా చూశారా? నల్లీ బొక్క వేయలేదని అల్లుడు అలిగి అత్తగారింటికి ఏళ్ల తరబడి వెళ్ళడు.
నల్లీ అంటే ఎముకలో ఉండే మూలుగ లేదా మజ్జ. దీనిని bone marrow అంటారు. ఇది రుచిగా వుంటుంది. ఇది dark maroon color లో ఉంటుంది.
ఎముక( ఘనాస్థి) లోపల రక్తం తయారవుతుంది.మనం తినే రుచికరమైన మెత్తని మజ్జలో రక్త కణాలు చాలా చాలా ఉంటాయి. నల్లీ లో proteins, minerals, fats, collagen వుంటాయి.
మేక కాళ్ళ సూప్ తరచుగా తీసుకోవడం వల్ల ఆ కాళ్లలో ఉండే collagen ప్రోటీన్ మోకాళ్ళ ఆరోగ్యం కాపాడుతుంది.
మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు తరచూ మేక కాళ్ళ సూప్ తాగితే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. మోకాళ్ళ దగ్గర collagen పెరిగి మోకాళ్ళ పటుత్వం పెరుగుతుంది.