పోష‌ణ‌

ఈ పండ్ల‌ను తింటే మీ రోగ నిరోధ‌క శ‌క్తి అమాంతం పెరుగుతుంది.. రోగాలు త‌గ్గిపోతాయి..

చాలా మంది తమకు షుగర్ ఉంది పండ్లు తినొద్దని చెబుతారు. కానీ పండ్లు తింటే నిజంగా షుగర్ పెరుగుతుందా అంటే అది పండ్లను బట్టి ఉంటుంది. ఇప్పుడు మనకు అందుబాటులో ఉండే పండు సీతాఫలం. ఇది ఒక సీజనల్ ఫ్రూట్. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే సీతాఫలంలో ఎన్నో అద్భుతమైన పోషక విలువలు ఉన్నాయని.

సీతాఫలంలో ఫైబర్, పొటాషియం, విటమిన్ బి 6 అధికంగా ఉంటాయి. డయాబెటిస్ ఉన్న వాళ్లు పండ్లను కూడా తినడానికి భయపడతారు, అయితే సీతాఫలంలో ఉండేటువంటి షుగర్ మీ రక్తంలో ఉండేటువంటి చక్కెర స్థాయిలను పెంచదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అనేక అనారోగ్య సమస్యలని నయం చేయడానికి సీతాఫలం చాలా బాగా ఉపయోగపడుతుంది.

take these fruits in this season to increase your immunity

అరటిపండు తినడం వలన జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది, హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ ఉన్న వారికి ఎంతో ఉపయోగపడుతుంది దాంతో పాటు అన్నిటి కంటే ముఖ్యమైనది అరటిపండును తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. ఇది తింటే కూడా షుగర్ పెరగదని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి బనానాను ఏదో ఒక రూపంలో తీసుకోవడం మంచిది.

నేరేడు పండ్లు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. ఇవి తింటే షుగర్ పెరుగదు. ఇదీ జీర్ణక్రియని మెరుగు పరుస్తుంది. నేరేడు సీజనల్ పండు. సీజన్‎లో దొరికే పండ్లు తింటే చాలని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. బత్తాయి, నిమ్మతో శరీరానికి సీ విటమిన్ వస్తుంది. ఇవి తింటే రోగనిధోక శక్తి పెరుగుతుంది.

Admin

Recent Posts