పోష‌ణ‌

మ‌హిళ‌లు ఎల్ల‌ప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఆహారాల‌ను తినాలి..!

శారీరకంగా పురుషులకు, మహిళలకు తేడా వుంటుంది. మహిళలకు వారి శరీరాన్ని మంచి షేప్ లో వుంచే ఆహారాలు కావాలి. కాని పురుషులకు శరీరాలను బలంగా వుంచే ఆహారాలు కావాలి. బరువు తగ్గేటందుకు ఆహారాలు అనేకం. కాని మహిళలకు తగినవి కొన్ని మాత్రమే. మహిళల ఆహారంలో ప్రధానంగా కావలసినవి రెండే రెండు అవి ఐరన్, కాల్షియం. మహిళలు ఎట్టిపరిస్ధితులలోను కాల్షియం, ఐరన్ తక్కువగా వుండే ఆహారాలు తినరాదు. మరి వారి అధిక బరువును తగ్గిస్తూ ఐరన్, కాల్షియంలు అందంచే ఆహారాలేమిటో పరిశీలిద్దాం. 1. ఓట్స్ – ఈ ఆహారంలో మానసిక విలువలు కూడా పెరిగే అవకాశం వుంది. ఓట్స్ తింటే పొట్ట నిండుతుంది, పోషకాలుంటాయి, ఫైబర్ అధికం ఎక్కువసేపు కడుపు నిండుగానే వుంటుంది. కనుక మరోమారు తినాలనిపించదు.

2. గుడ్లు – మహిళల బ్రేక్ ఫాస్ట్ కు చాలా మంచివి. మంచి ప్రొటీన్లు అధికం. కొల్లెస్టరాల్ వుంటే తప్ప మహిళలు బ్రేక్ ఫాస్ట్ లో ఎగ్ తినటం ఆపవద్దు. 3. పచ్చని కూరగాయలు – బచ్చలికూర, బ్రక్కోలి, తోటకూర, మెంతికూర వంటివి మహిళలకు కావలసిన ఐరన్ అందిస్తాయి. హెమోగ్లోబిన్ కౌంట్ పెరుగుతుంది. కేలరీలు లేని పీచు బాగా లభిస్తుంది. బరువు తగ్గాలంటే ఇది మంచి చిట్కా. 4. వెన్నతీసిన పాలు – మహిళ శరీరంలో తగిన కాల్షియం వుండాలంటే ప్రతిరోజూ ఒక గ్లాసెడు పాలు తాగాల్సిందే. 40 సంవత్సరాలపైన వారి ఎముకలు అరుగుదల చూపకుండా వుంటాయి. వెన్నతీసిన పాలు మాత్రమే ఉదయం, సాయంత్రం తాగండి. మంచి పోషకాలు, కడుపు నిండటం వుంటుంది. అదే విధంగా తక్కువ కొవ్వుకల పాల ఉత్పత్తులు ఏవైనా సరే తినవచ్చు.

women must take these foods to be healthy

5. ఆరెంజ్, స్ట్రాబెర్రీ, కూరగాయలు – కేరట్లు, బీట్ రూట్, ఆరెంజ్ వంటివి ఐరన్ అధికంగా వుండే ఆహారాలు. వీటిని తప్పని సరిగా మీ మెనూలో వుంచండి. 6. చేపలు – సీ ఫిష్ తప్పని సరిగా తినాలి. దీనిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు వుంటాయి. కొవ్వు లేని ఆహారం. మెరిసే చర్మం, నిగ నిగలాడే జుట్టు చేప ఆహారానికి అదనపు ఆకర్షణలు. మహిళలు ఈ ఆహారాలు తింటే….అందరిని ఆకర్షించే అంగాంగ సౌందర్యం వారి సొంతం.

Admin

Recent Posts