ఇది… భార్యను కోల్పోయిన ఓ భర్త ఆవేదన, 14 రోజుల నరకయాతన….. ఆ సంఘటన గురించి అతడి మాటల్లోనే విందాం. జనవరి 7 వతేది సాయంత్రం 6 గంటల ప్రాంతంలో…. నా బైక్ మీద నేను , నా భార్య వెళుతున్నాము, తమిళనాడు లోని అన్నానగర్ దగ్గర నా భార్య బండి మీదినుండి కిందపడి..స్పృహ తప్పిపోయింది. వెంటనే దగ్గర్లోని హాస్పిటల్ కు తీసుకెళ్లా, సిటీ స్కాన్ చేసిన డాక్టర్లు మెదడు ఎడమవైపు ఉబ్బుతుంది…. బతకడం కష్టం అని చెప్పారు. వెంటనే అక్కడి నుండి ఓ కార్పోరేట్ హాస్పిటల్ లో చేర్పించా. సర్జరీ చేసిన తర్వాత….ఆమె మెదడు క్రమంగా స్పందించడమే మానేసింది, అదే సమయంలో నా భార్య 5 నెలల గర్బావతి… తల్లి కోమాలో, పిండం కడుపులో….ఇద్దరూ బతకడం కోసం పోరాడుతూనే ఉన్నారు. కానీ అయిదు రోజుల తర్వాత…నా భార్య కడుపులోని నా కొడుకు చనిపోయాడు. కన్ను తెరిచి లోకాన్ని కూడా చూడకుండా….వాడు అనంతలోకాలకు వెల్లిపోయాడు.
నీ భార్యది బ్రెయిన్ డెడ్ అని ధృవీకరించారు డాక్టర్లు…..అవయవధానం గురించి గతంలోనే మేమిద్దరం మాట్లాడుకున్నాం. ఏడుస్తూనే ఆర్గాన్ డొనేషన్ పేపర్ పై సంతకం చేశా… జనవరి 13 న నా భార్య నన్ను విడిచిపోయింది. జనవరి 1న నా భార్య తో కలిసి చివరి సెల్పీ దిగాను.
ఇంత బాధలో కూడా ఈ విషయం మీకెందుకు చెబుతున్నానంటే.. బైక్ నడిపేటప్పుడు నేను హెల్మెట్ పెట్టుకున్నాను, కానీ నా భార్య పెట్టుకోలేదు… నా భార్యకు కూడా ఓ హెల్మెట్ ఇప్పించి ఉంటే…ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నా భార్య ను నే కోల్పోయేవాడిని కాదు. అందుకే భద్రత ముఖ్యం.ఒక్క చిన్న అజాగ్రత్త నా జీవితాన్నే నా నుండి దూరం చేసింది…..I Miss You Raaa, I Miss You.