Off Beat

కొత్త‌గా పెళ్ల‌యిన యువ‌తి బామ్మ‌ని అడిగిన ప్ర‌శ్న‌.. త‌ప్పుడ‌ర్థం లేదు.. నీతి ఉంది..

ఒక వృద్ధురాలు.. వాళ్ళ ఆయనతో రోజూ కాఫీ డబ్బా మూత తీయిస్తుండడం చూసిన పక్కింట్లోని కొత్తగా పెళ్లయిన ఓ అమ్మాయి… ఉండబట్టలేక అడిగింది.

బామ్మా.. మీరు రోజూ తాతగారితో ఇలా కాఫీ మూత ఎందుకు తీయిస్తున్నారు.. మీరే తీసుకోవచ్చు కదా అని..!! అప్పుడు.. బామ్మ ఇలా చెప్పింది. మూత తీయడం పెద్ద కష్టం ఏమీ కాదమ్మా నేను తీయగలను. కానీ నా చేత కావడం లేదు మీరు కాస్త తీసివ్వండి అన్నప్పుడు.. ఆయన కళ్ళలో నేను బలశాలి అనే నమ్మకం కనబడుతుంది. నా భార్యకు అన్నీ నేనే నన్నే నమ్ముకుంది అనే ప్రేమ కనబడుతుంది.

a married girl asked old woman a question

వయసు పెరిగినా ఇంకా నా వల్ల ఏదో ఒక ఉపయోగం ఉంది అనే ఆత్మవిశ్వాసం కనబడుతుంది. ఈ భూమికి భారంగా నేను లేను అనే సంతోషం కనబడుతుంది. అందుకే ప్రతిరోజు ఇలా చేస్తాను. బామ్మ చెప్పిన సమాధానం విన్న నవ వధువు ఆశ్చర్యపోయింది. అసలైన భార్యాభర్తల సంబంధం విలువ ఏంటో తెలిసిందంటూ బామ్మకి కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయింది.

నిజమే కదండీ.. మనిషి నావల్ల ఎటువంటి ఉపయోగం లేదు అనుకున్నప్పుడు కృంగిపోయి నశించిపోతారు. అలా కాకుండా ఇలాంటి చిన్న చిన్న విషయాల వల్ల వారిని ఉన్నంతవరకు సంతోషంగా ఉంచొచ్చు కదా!

Admin

Recent Posts