Off Beat

అమ్మాయిలపై అత్యాచారాలకు పాల్పడే వారికి దేశ విదేశాల్లో విధించే శిక్షలు..!

మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డవారికి దేశ విదేశాల్లో ఎటువంటి శిక్షలున్నాయో ఓ సారి తెలుసుకుందాం, కొన్ని దేశాల చట్టాలు భయంకరంగా ఉంటే మరికొన్ని దేశాల్లో సాధారణ శిక్షలున్నాయి. ఈ మధ్య‌కాలంలో అమ్మాయిలపై లైంగిక దాడులెక్కువైయ్యాయి. అయినా నిజమైన మగాడు మహిళలకు అండగా ఉండాలే కానీ అఘాయిత్యాలకు పాల్పడం పాశవికం. ఈ శిక్షలను చూసైనా మానవమృగాలు ఇకపై అటువంటి అఘాయిత్యాలకు పాల్పడరని ఆశిద్దాం. ఇరాన్‌లో అత్యాచారానికి పాల్పడ్డ అపరాధులకు మరణశిక్షను విధిస్తారు. నడి రోడ్ లో ప్రజలంతా చూస్తుండగా దోషులను ఉరితీస్తారు, ఇంకా బ్రతికే ఉన్నారనిపిస్తే రాళ్ళతో కొట్టి చంపేస్తారు. ఆఫ్ఘనిస్తాన్ లో ఎవరైనా అత్యాచారానికి పాల్పడితే అలాంటి వారిని తలపై కాల్చి చంపేస్తారు, కోర్టు ఉత్తర్వుల ప్రకారం కొన్నిసార్లు ఉరి తీస్తారు అది కూడా నాలుగు రోజుల వ్యవధిలోనే.

చైనాలో అత్యాచారం చేసిన వారికి మరణశిక్ష లేదా జీవితకాల శిక్షను విధిస్తారు. అయితే కొన్ని సార్లు అక్కడి న్యాయస్థానం అధికారుల తప్పుల వల్ల అమాయకులను శిక్షించింది. బలత్కారం చేసినవారికి శిక్ష కంపల్సరిగా ఉంటుంది. అత్యాచారం చేసిన దోషులను చంపడానికి ఉత్తర కొరియాలో ప్రత్యేక దళం ఉంది. సౌదీ అరేబియాలో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. అత్యాచారం చేసిన వాళ్ళను నడివీధిలో కూర్చోబెట్టి అందరూ చూస్తుండగా ఎటువంటి కనికరం లేకుండా తల నరికివేస్తారు. ఇది కూడా విచారణ జరిగిన తర్వాతే శిక్షిస్తారు. భారతదేశంలో 2013 నుండి ఒక కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. అత్యాచారం చేసిన వారికి జీవితకాలం పాటు ఖైదీలుగా, లేదా 14 ఏళ్ళ జైలు శిక్షను కానీ మరణశిక్షను కానీ విధిస్తారు.

death sentence will be issued to rapists in these countries

రష్యాలో వారి చట్టాలు అంత కఠినంగా ఉండవనే చెప్పాలి. ఎందుకంటే అత్యాచారం చేసిన అపరాధులకు 3-6 ఏళ్ళ పాటు జైలు శిక్ష విధిస్తారు, మరీ ఎక్కువగా అంటే 10-20 ఏళ్ళ వరకు ఉంటుంది. ఇక కొన్నిసార్లు మాత్రమే ఆ బాధితులకు ఎక్కువ శిక్షపడే ఆస్కారం ఉంది.

Admin

Recent Posts