Off Beat

చంద్రుడి మీద అమెరికా నిజంగానే కాలు మోపిందా..? నాసా అబ‌ద్దాలు చెబుతుందా..?

అమెరికా చంద్రుడి మీద కాలు మోపిన వీడియో అంతా ఒక రహస్య ప్రదేశంలో చిత్రీకరణ జరిగిందని చాలా మంది అభిప్రాయం. చంద్రుని మీద నిజంగా అమెరికా 1969లోనే కాలు పెట్టిందా? ఒకవేళ నిజమే అయితే అప్పటి రికార్డులను ఎందుకు బయటి ప్రపంచానికి తెలియనీకుండా కారణాలు చెప్తుంది? చంద్రుడు మీద మనుషులు దిగడం అనేది 1969 లో అందరు సంబరాలు చేసుకున్న సంఘటన. కానీ సమయం గడుస్తున్నా కొద్దీ, మళ్ళీ ఎందుకు ఇన్ని సంవత్సరాలలో వెళ్లలేదని చాలా మంది దీనిని అనుమానించడం మొదలుపెట్టారు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత సోవియట్ యూనియన్‌(USSR) కి USA కి మధ్య ప్రచ్ఛన్నయుద్ధం(Cold war) జరిగింది. అంతరిక్షానికి సంబంధించిన అనేక ప్రాజెక్టులలో USSR ముందంజ వేసింది. USA ని ముందంజలో ఉంచినదే ఈ moon landing.

Moon landing నిజంగా జరిగింది అని చెప్పడానికి ఆధారాలు. ఇతర దేశాలు కూడా చూసాయి. అప్పట్లో సోవియట్ యూనియన్ (రష్యా) అమెరికాకి పెద్ద శత్రువే. వాళ్లు NASA మిషన్‌ని చాలా జాగ్రత్తగా చూశారు. అది నకిలీ అయితే వాళ్లు ముందే బయట పెట్టేవారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. చంద్రుడిపై అద్దాలు వేశారు. NASA వారు చంద్రుడిపై laser అద్దాలు పెట్టారు (అపోలో 11, 14, 15). భూమి నుండి laser beam పంపితే, అది ఆ అద్దం తాకి తిరిగి వస్తుంది. ఇవి ఇప్పటికీ పని చేస్తూ ఉన్నాయి — prove చేయడానికి ఇది సరిపోతుంది. చాలా మంది పనిచేశారు. NASA చంద్ర మిషన్లో 4 లక్షల మంది అత్యంత విద్యావంతులు పనిచేశారు. అప్పుడు అంతమందిని, అలాంటివారిని మోసం చేయడం కుదరదు. ఎవరో ఒకరు బయట చెప్పేవాళ్లే.

did nasa really stepped on moon

చంద్రుడి రాయి – భారతదేశంలో ఉంది. NASA వారు తీసుకొచ్చిన 380kg చంద్రుడి రాళ్లలో ఒక రాయి భారతదేశానికి ఇచ్చారు. అది ఢిల్లీలోని National science museumలో ఉంది. ఇది నకిలీ అయితే NASA ఇలా ఇవ్వదు. చాలామంది శాస్త్రవేత్తలు వీటిని పరీక్షించారు. వీటిని ఇతర దేశాల శాస్త్రవేత్తలు కూడా పరీక్షించి చంద్రుడి నుంచే వచ్చాయని చెప్పారు. ప్రత్యక్షంగా ప్రసారం చేశారు. చంద్రుడిపై నడుస్తున్న వ్యోమగాముల వీడియోలు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్షంగా చూపించారు. ఆ signals ను అమెరికా కాకుండా ఆస్ట్రేలియా, స్పెయిన్ లాంటి దేశాల్లో కూడా అందుకున్నారు. చంద్రుడి ఫోటోలు ఇప్పటికీ తీస్తున్నారు. NASA, భారతదేశం పంపిన ఉపగ్రహాలు అపోలో ల్యాండింగ్ చోటు ఫోటోలు తీశాయి.

వాటిలో ల్యాండర్ పాదాలు, మానవుల నడక ముద్రలు కనిపిస్తున్నాయి. రాకెట్, టెక్నాలజీ అందుబాటులోనే ఉంది. అప్పటి సాటర్న్-5 రాకెట్ చాలా శక్తివంతమైనది. NASA వాళ్లు ఎన్నో సంవత్సరాల పరిశోధనతో మిషన్‌ను successfulగా చేశారు. చంద్రుడిపై మళ్లీ ల్యాండింగ్ చేయలేదేంటి అంటే — చాలా ఖర్చుతో కూడుకున్న పని కావడం ఒక కారణం. అలాగే, అప్పట్లో సోవియట్ యూనియన్‌ను జయించడం ప్రధాన లక్ష్యం, అది సాధించాక NASA దృష్టి అంతరిక్ష కేంద్రాలు, ఇతర గగనయాన మిషన్లు మీదకి మళ్లింది. మళ్లీ అంత ఖర్చుపెట్టి మనుషులను పంపించాల్సిన అవసరం రాలేదు. కావలసిన పరిశోధన రోవర్లు చేయగలవు. ఒకవేళ నిజమే అయితే అప్పటి రికార్డులను ఎందుకు బయటి ప్రపంచానికి తెలియనీకుండా కారణాలు చెప్తుంది? అలా ఏమి లేదు. ఆ footage నాసా site లో ఉంది, మీరు చూడొచ్చు.

Admin

Recent Posts