Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home Off Beat

మ‌నం నిత్యం వాడే ఈ వ‌స్తువుల‌ను ఒక‌ప్పుడు వేరేగా ఉప‌యోగించేవారు తెలుసా..!

Admin by Admin
January 31, 2025
in Off Beat, వార్త‌లు
Share on FacebookShare on Twitter

కుడి ఎడ‌మైతే పొర‌పాటు లేదోయ్‌. అనే పాట‌ను మీరు వినే ఉంటారు. అవును, అదే. ఇప్పుడు మేం చెప్ప‌బోయే విష‌యాల‌కు కూడా స‌రిగ్గా ఇదే పాట వ‌ర్తిస్తుంది. ఎందుకంటే ఒక ఉద్దేశం కోసం త‌యారు చేయ‌బ‌డిన ఒక వ‌స్తువు లేదా ఒక విధానం మ‌రొక ప‌నికి కూడా అవస‌రం వ‌స్తే.. అది ఎలా ఉంటుంది. చాలా బాగుంటుంది క‌దా.! అవును, బాగానే ఉంటుంది. మ‌నం నిత్యం వాడే కొన్ని వ‌స్తువులు కూడా స‌రిగ్గా ఇలాగే వ‌చ్చిన‌వి. వాటిని గ‌తంలో వేరే ఉద్దేశం కోసం త‌యారు చేశారు. కానీ వాటిని ఇప్పుడు మ‌నం వేరేగా వాడుతున్నాం. మ‌రి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందామా. బీర్ టాప్.. ఒక‌ప్పుడు దీన్ని బీర్ గ్లాస్‌ల‌పై పెట్టేవారు. దాంతో అందులో పురుగులు ప‌డ‌కుండా ఉంటాయ‌ని అనుకునేవారు. అప్ప‌ట్లో దీన్ని బీర్ డెకెల్ అని పిలిచేవారు. అయితే కాలానుగుణంగా దీని వాడ‌కం మారింది. ఇప్పుడు దీన్ని బీర్ గ్లాసుల కింద పెడుతున్నారు. ఎందుకంటే బీర్ గ్లాస్ పెట్ట‌డం వ‌ల్ల టేబుల్ పాడ‌వుతుంద‌ని భావించారు. అందుకే దీన్ని ఇప్పుడు బీర్ గ్లాసుల కింద పెడుతున్నారు.

టీ.. మ‌నం ఇప్పుడంటే ర‌క ర‌కాల టీల‌ను తాగుతున్నాం. కానీ ఒక‌ప్పుడు టీని చైనాలో మెడిసిన్‌గా వాడేవార‌ట తెలుసా. అప్ప‌టి వైద్యులు గౌట్ అనే వ్యాధికి మందుగా టీని మెడిసిన్‌గా ఇచ్చేవార‌ట‌. నైట్ అల్ఫాబెట్.. 1808లో కెప్టెన్ చార్లెస్ బార్బెర్ యుద్ధంలో ఉన్న సైనికుల‌కు రాత్రి పూట ర‌హ‌స్యంగా సందేశాలు పంపేందుకు నైట్ అల్ఫాబెట్ అనే ప‌ద్ధ‌తిని త‌యారు చేశారు. వెలుతురు లేకుండా చీక‌ట్లో పేప‌ర్ల‌పై ఉండే అక్ష‌రాల‌ను చేతుల్తో త‌డుముతూ వాటిని చ‌దివే విధానం అన్న‌మాట‌. ఒక ర‌కంగా చెప్పాలంటే దీన్ని బ్రెయిలీ మెథ‌డ్ అన‌వ‌చ్చు. అయితే అప్ప‌ట్లో దీన్ని సైనికులు వాడేవారు. లైట్ వేసుకుని ఉంటే శ‌త్రువులు ఉనికిని ప‌సిగ‌డ‌తారు క‌దా. అందుకే లైట్ తీసేవారు. మ‌ర‌లాంట‌ప్పుడు సందేశాలు చ‌ద‌వాలంటే కుద‌ర‌దు క‌దా. అందుక‌నే ఈ ప‌ద్ధ‌తి ద్వారా సైనికులు సందేశాల‌ను పంపుకునేవారు. అయితే ఆ త‌రువాత ఇదే ప‌ద్ధ‌తిలో బ్రెయిలీ లిపి త‌యారైంది. అది అంధుల‌కు ఎంత‌గా ఉప‌యోగ‌ప‌డుతుందో అంద‌రికీ తెలిసిందే.

do you know that these items are designed once for other usage

ఎం అండ్ ఎం క్యాండీస్.. ఎండ‌లో ఉన్న‌ప్ప‌టికీ క‌రిగిపోకుండా ఉండేలా అమెరికాలో ఎం అండ్ ఎం కంపెనీ అప్ప‌ట్లో క్యాండీస్‌ను త‌యారు చేసింది. అయితే వాటిని కేవ‌లం ఆర్మీ కోస‌మే త‌యారు చేశారు. రెండో ప్ర‌పంచ యుద్ధంలో ఉన్న సైనికుల కోసం వాటిని త‌యారు చేశారు. అయితే త‌రువాత అవి క‌మ‌ర్షియ‌ల్‌గా మార్కెట్‌లోకి వ‌చ్చి జ‌నాలకు కూడా అందుబాటులో ఉన్నాయి. బెలూన్ యానిమ‌ల్స్.. బెలూన్ల‌ను మ‌డ‌త‌బెట్టి మ‌నం జంతువులు, ప‌క్షుల రూపంలో వివిధ ఆకారాల‌ను క్రియేట్ చేస్తాం క‌దా. అయితే ఇలా ఒక‌ప్పుడు అజ్‌టెక్స్ చేసేవార‌ట‌. వారు జంతువుల పేగుల‌తో ఇలాంటి ఆకారాల‌ను త‌యారు చేసి వాటిని త‌మ పిర‌మిడ్స్‌పై ద‌హ‌నం చేసే వార‌ట‌. దీంతో త‌మ దేవుళ్లు శాంతి చెందుతార‌ని వారు భావించేవారు. అందుక‌నే వారు అలా ఆకారాల‌ను త‌యారు చేసేవారు. కానీ మ‌నం ఇప్పుడు వాటిని వేరేగా ఉప‌యోగిస్తున్నాం.

గొడుగులు.. యూర‌ప్‌, చైనాల్లో అప్ప‌ట్లో గొడుగుల‌ను ఎండ‌లో వాడేవార‌ట‌. బాగా ఎండ‌గా ఉంటే గొడుగుల‌ను వేసుకెళ్లేవార‌ట‌. అయితే 1750వ సంవ‌త్స‌రంలో జోనాస్ హ‌న్‌వే అనే వ్య‌క్తి మొద‌టి సారిగా వ‌ర్షంలో గొడుగును వాడ‌డంతో త‌రువాత గొడుగును ఎక్కువగా వ‌ర్షం ప‌డిన‌ప్పుడు వాడ‌డం మొద‌లు పెట్టారు. హుడ్స్.. వెనుక వైపు క్యాప్ వ‌చ్చే ప్ర‌త్యేక‌మైన దుస్తుల‌ను ఒక‌ప్పుడు కొంద‌రు వ‌ర్గీయులు ముఖం దాచుకునేందుకు వాడేవార‌ట‌. అది వారి మ‌త ఆచార‌మ‌ట‌. అందుక‌నే అలాంటి దుస్తుల‌ను వారు వేసుకునేవారు. కానీ ఇప్పుడిలాంటి దుస్తులు ఫ్యాష‌న్ అయ్యాయి. కోగ్‌నాక్.. నిజానికి వైన్‌ల‌లో ఇదొక ర‌కం. మొద‌ట్లో వైన్‌ను త‌యారు చేసిన‌ప్పుడు దాని గాఢ‌త వ‌ల్ల అందులో నీళ్లు క‌లుపుకుని తాగాల్సి వ‌చ్చేద‌ట‌. కానీ త‌రువాత కాలంలో నీరు అవ‌స‌రం లేకుండా వైన్‌ను డైరెక్ట్ గా తాగేలా త‌యారు చేశారు. అందుక‌నే ఇప్పుడు మ‌నం తాగే వైన్‌లో నీళ్లు క‌ల‌పాల్సిన ప‌నిలేదు. కానీ కొంద‌రు కూల్ డ్రింక్స్ మాత్రం క‌లుపుకుంటారు. అస‌లైతే అది కూడా అవ‌స‌రం లేదు. వైన్‌ను డైరెక్ట్‌గా తీసుకుని ఎంజాయ్ చేయ‌వ‌చ్చు.

విండోస్ గేమ్స్‌.. విండోస్ పీసీల్లో ఉండే ఫ్రీ సెల్‌, హార్ట్స్‌, మైన్ స్వీప‌ర్ గేమ్స్ గురించి తెలుసు క‌దా. అయితే ఇప్పుడంటే చాలా మంది ఆ గేమ్స్‌ను కంప్యూట‌ర్ల‌లో ఆడుతూ టైం పాస్ చేస్తున్నారు. కానీ మీకు తెలుసా..? అస‌లు ఆ గేమ్స్‌ను క్రియేట్ చేసింది వాటిని ఆడి టైం పాస్ చేయ‌డానికి కాదు. ఒక‌ప్పుడు.. అంటే.. 1990ల‌లో వ‌చ్చిన కంప్యూట‌ర్ల‌కు కొత్త‌గా మౌస్‌లు పెట్టేవారు. వాటిని ఎలా వాడాలో చాలా మందికి తెలిసేది కాదు. దీంతో మౌస్ ల‌ను ఎలా వాడాలో ప్రాక్టిక‌ల్‌గా చెప్పేందుకే ఆ గేమ్స్‌ను క్రియేట్ చేశారు. అంతేకానీ ఎంజాయ్‌మెంట్ కోసం కాదు. ష‌ర్ట్ లూప్.. ష‌ర్ట్ వెనుక భాగంలో ఉండే లూప్‌ను మీరు గ‌మ‌నించారా ? దాన్ని ఒక‌ప్పుడు ఎందుకు పెట్టారంటే.. ష‌ర్ట్‌ను కొక్కేనికి త‌గిలించిన‌ప్పుడు దానికి త‌గిలిస్తే సుల‌భంగా తీయ‌వ‌చ్చ‌ని. అదే కాల‌ర్‌కు త‌గిలిస్తే కాల‌ర్ పాడ‌వుతుంది. అందుక‌ని ష‌ర్ట్‌ను హుక్‌కు త‌గిలించేందుకు అలా వెనుక భాగంలో లూప్‌ల‌ను పెట్టేవారు. అది ఇప్ప‌టికీ అలాగే ఉంది. కానీ దాన్ని ఇప్పుడు ఎవ‌రూ వాడ‌డం లేదు.

ఎరేజ‌ర్‌.. ఎరేజ‌ర్‌కు ఒక వైపు రెడ్‌, మ‌రో వైపు బ్లూ క‌ల‌ర్ ఉంటుంది క‌దా. బ్లూ క‌ల‌ర్ ఉన్న భాగాన్ని మొద‌ట్లో దేనికి వాడేవారంటే.. రెడ్ క‌ల‌ర్ భాగంతో పెన్సిల్ గీత‌ల‌ను ఎరేజ్ చేసిన‌ప్పుడు పేప‌ర్ల‌పై రెడ్ క‌ల‌ర్ మ‌ర‌క‌లు ప‌డేవ‌ట‌. వాటిని తొల‌గించేందుకు ఎరేజ‌ర్‌కు మ‌రో వైపు ఉండే బ్లూ భాగాన్ని వాడేవారు. అయితే ఇప్పుడీ బ్లూ భాగాన్ని పెన్ గీత‌ల‌ను చెరిపేందుకు వాడుతున్నారు. జీన్ ప్యాంట్ పాకెట్.. ఇప్పుడు మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక జీన్ ప్యాంట్స్‌లో ముందు రెండు, వెనుక రెండు జేబుల‌తోపాటు మ‌రో జేబు కూడా ఉంటుంది క‌దా. అదేనండీ కుడి వైపు ఉండే జేబుకు పైన మ‌రో జేబు ఉంటుంది క‌దా. దాన్ని అప్ప‌ట్లో ఎందుకు వాడేవారో తెలుసా.. అందులో ఒక‌ప్పుడు గ‌డియారాలు వేసుకునే వారు. అందుక‌నే ఆ పాకెట్‌ను వాచ్ పాకెట్ అని పిల‌వ‌డం మొద‌లు పెట్టారు. అయితే ఇప్పుడు మ‌నం ఆ పాకెట్ లో చిన్న చిన్న వ‌స్తువులు, చిల్ల‌ర కాయిన్స్ వేసుకుంటున్నాం. దాని యూసేజ్‌ను పూర్తిగా మార్చేశాం.

Tags: itemsusage
Previous Post

సక్సెస్ అయిన వారు..ఆఫీస్ లో చివరి 10 నిమిషాలు ఏం చేస్తారో తెలుసా.? ఫాలో అవ్వాల్సిన 12 సలహాలు

Next Post

ట్యాబ్లెట్లు మింగుతున్నారా.. అయితే త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యం..!

Related Posts

వినోదం

సీనియర్ ఎన్టీఆర్ నుండి పవన్ కళ్యాణ్ వరకు రెండు పెళ్లిళ్లు చేసుకున్న నటులు ..!!

July 22, 2025
హెల్త్ టిప్స్

రోడ్లపై పునుగులు, బోండాలు, మంచూరియా, తింటున్నారా..అయితే నష్టాలు తప్పవు..!

July 22, 2025
ఆధ్యాత్మికం

స్త్రీలు సాష్టాంగ న‌మ‌స్కారం ఎందుకు చేయ‌కూడ‌దు..? దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటి..?

July 22, 2025
హెల్త్ టిప్స్

పాప్‌కార్న్‌ను అధికంగా తింటున్నారా..? అయితే ముందు ఈ విష‌యాల‌ను తెలుసుకోండి..!

July 22, 2025
inspiration

మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ వాడే ఫోన్ ఏంటో తెలుసా..? ఆపిల్ iPhone వాడకపోవటానికి కారణం ఇదే..!

July 22, 2025
హెల్త్ టిప్స్

రోజూ భోజ‌నంలో పెరుగును త‌ప్ప‌నిస‌రిగా తినాల్సిందే.. ఎందుకంటే..?

July 22, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.