Off Beat

న్యూస్ పేపర్ కింద ఈ చుక్కలు ఎందుకు ఉంటాయో మీకు తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మందికి న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉంటుంది&period; న్యూస్ పేపర్ లో మనం సరిగ్గా గమనించినట్లైతే చదివే ప్రతి న్యూస్ పేపర్ కి కింది లైన్ లో రంగు చుక్కలు లేదా అదే రంగులో ఉండే వేరే వేరే సింబల్స్ ని మీరెప్పుడైనా గమనించారా&period; అయితే వాటిని చూసి కూడా మీరు పెద్దగా పట్టించుకోరు&period; అసలు ఆ నాలుగు చుక్కలు న్యూస్ పేపర్ మీద ఎందుకు ప్రింట్ అయి ఉంటాయో తెలిస్తే మీరు షాక్ అవుతారు&period; సాధారణంగా ప్రింటర్ల లో ఏవైనా పేజీలు ప్రింట్ తీస్తే ఆ ప్రింటర్ ఆ పేజీలో సైజుకి అనుగుణంగా అక్షరాలను ఒక స్టైల్లో క్రమబద్ధమైన కొలతతో ప్రింట్ చేసి మనకిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&NewLine;అలా ఎందుకిస్తుందంటే దాని అలైన్ మెంట్ అమరిక అలా ఉంటుంది&period; అక్షరాలు కానీ&comma; ఫోటోలు కానీ బ్లర్ గా రాకుండా ఉండడం కోసమే ప్రింటర్లో ప్రింట్ అయ్యే ముందే అలా అలైన్మెంట్ చేసి ఉంటుంది&period; అందుకే మనం ఇచ్చే ప్రింట్స్ కానీ&comma; ఫోటోలు కానీ క్రమపద్ధతిలో వస్తాయి&period; సరిగ్గా ఇదే సూత్రం న్యూస్ పేపర్ ప్రింటింగ్ కి కూడా వర్తిస్తుంది&period; ఈ క్రమంలోనే ఏదైనా కలర్ పేజీలో టెక్స్ట్ లేదా ఫోటోను అలైన్మెంట్ ప్రకారం ప్రింటింగ్ చేయాలంటే అందుకు పైన చెప్పిన ఈ నాలుగు చుక్కలు ఉపయోగపడతాయి&period; నిజానికి ప్రతి న్యూస్ పేపర్ లో ఉండే ఆ నాలుగు చుక్కలు నాలుగు కలర్స్ లో ఉంటాయి&period; అవే CMYK&period; C అంటే సియాన్ బ్లూ&comma; M అంటే మెజెంటా పింక్&comma; Y అంటే ఎల్లో&comma; K అంటే బ్లాక్ అని అర్థం&period; ఈ నాలుగు కలర్స్ పేపర్స్ ప్రింట్ తీసే సమయంలో పలురకాలుగా మిక్స్ అయిపోయి కొన్ని లక్షల సంఖ్యలో కలర్స్ ను సృష్టిస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-72928 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;color-lines&period;jpg" alt&equals;"do you know what are these 4 dots printed on news papers " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అందుకే ఈ రంగులను ప్రాథమిక రంగులు అని అంటారు&period; కలర్స్ కి సంబంధించిన అలైన్మెంట్ సరిగ్గా లేకపోతే కలర్స్ ప్లేట్స్ అటూ ఇటూ కదిలి ప్రింటింగ్ తీసిన పేపర్స్ ను కానీ&comma; ఫోటోలు కానీ బ్లర్ గా ప్రింట్ అవుతాయి&period; మరొక విషయం ఏమిటంటే న్యూస్ పేపర్ కి మధ్యభాగంలో సరిగ్గా ప్రింట్ అవుతుందో లేదో తెలుసుకోవడానికి ప్రతి పేపర్ ని తీసుకొని ప్రతి పేజీ ని చెక్ చెయ్యడం అసంభవం&period; దాన్ని తెలుసుకోవడానికి పైన చెప్పిన ఈ నాలుగు చుక్కలను గమనిస్తే సరిపోతుంది&period; అవి సరైన పద్ధతిలో వస్తూ ఉంటే పేజీలన్నీ సరైన క్రమంలో వస్తున్నట్లు అర్థం చేసుకోవాలి&period; ఒకవేళ ఇవి బ్లర్ అయితే పేపర్ మొత్తం బ్లర్ అయినట్టు తెలుసుకోవాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts