Off Beat

OYO అంటే ఇంత అర్థం ఉందా! ఈ మాత్రం తెలియకుండానే అక్కడికి వెళ్తున్నారా?

పిల్లల నుండి పెద్దల వరకు OYO అంటే తెలియని వాళ్లు ఉండరు. తెలియని ప్రాంతానికి వెళ్లి, అక్కడ ఉండాలంటే టక్కున గుర్తుకు వచ్చేవి ఓయో రూమ్స్‌నే. అయితే ఆ రూమ్స్‌కి ఓయో రూమ్స్ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? OYO దేశవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందింది. పిల్లల నుండి పెద్దల వరకు, OYO అందరికీ సుపరిచితం. అతి తక్కువ ధరలోనే ఉండడానికి రూమ్స్ అందిస్తుంది.

అలాగే ఏదైనా ఇతర హోటల్‌లో గదిని బుక్ చేసుకోవడానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అదే ఓయోలో రూమ్‌ని బుక్ చేసుకోవడానికి ఎక్కువ డాక్యుమెంటేషన్ అవసరం లేదు. చాలామంది OYOలో ఉండటానికి ఇష్టపడటానికి ఇదే కారణం. దీంతో పాటుగా సులభంగా ఎక్కడనుంచైనా వీటిని బుక్ చేసుకోవచ్చు. ప్రయాణంలో ఓయోలో బస చేసిన వారు చాలా మంది ఉన్నారు. అయితే ఓయో అంటే అర్థం ఏంటో చాలా మందికి తెలియదు? అసలు ఓయో అంటే అర్థం ఏంటంటే?

do you know what is the meaning of oyo

OYO యజమాని రితేష్ అగర్వాల్ దీన్ని ప్రారంభించినప్పుడు దానికి ఒరవల్ అని పేరు పెట్టారు. కానీ 2013లో దాని పేరును OYO రూమ్స్‌గా మార్చారు. ఈ OYO పూర్తి పేరు ఆన్ యువర్ ఓన్. ఓయో రూమ్ బుక్ చేసుకున్న వారు దాన్ని వారి సొంత రూమ్ లాగా భావించాలనే ఉద్దేశంతో దానికి ఓయో అనే పేరు పెట్టారు.

Admin

Recent Posts