Off Beat

బీర్బ‌ల్ తెలివి.. మాంసం వ్యాపారి, చ‌మురు వ్యాపారి మ‌ధ్య గొడ‌వ‌కు బీర్బ‌ల్ ఇచ్చిన‌ తీర్పు..

మాంసం వ్యాపారికి , చ‌మురు వ్యాపారికి మ‌ధ్య చాలా పెద్ద గొడవ జ‌రిగింది. త‌మ తగువు తీర్చమని ఇద్ద‌రూ అక్బ‌ర్ ద‌గ్గ‌ర‌కు వెళ్ళారు. వెంట‌నే అక్బ‌ర్.. బీర్బల్ కు ఈ స‌మ‌స్య‌ను అప్ప‌గించి ప‌రిష్క‌రించ‌మ‌ని చెప్పాడు. దానికి బీర్బ‌ల్ …అస‌లేం జ‌రిగింది అని అడ‌గ‌గా….

మాంసం వ్యాపారి.. నేను మాంసం అమ్ముకుంటుంటే ఈ చమురు వ్యాపారి నా దుకాణానికి వచ్చి చమురు పోస్తానన్నాడు. పాత్ర తీసుకు రావడానికి నేను లోపలికి వెళ్ళినప్పుడు ఇతను నా నాణాల సంచి తీసుకుని అది తనదే అని గొడవ చేస్తున్నాడు.

how birbal solved a problem between meat business man and oil business man

చమురు వ్యాపారి లేదు! అతను చెప్పేవన్నీ అబద్ధాలు. ఆ సంచి నాదే. నేను నాణాలు సంచి లోంచి తీసి లెక్క‌ పెడుతున్నాను. అది చూసి ఇతను దురాశతో నా సంచి కాచేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు.. అన్నాడు.

ఎన్నిసార్లు అడిగినా ఇద్ద‌రి నుండి ఇదే స‌మాధానం. దీంతో బీర్బ‌ల్ నీటితో నిండిన ట‌బ్ ను తెప్పించాడు…ఆ సంచిలో ఉన్న నాణాలన్నీ అ నీటి ట‌బ్ లో ప‌డేశాడు…అప్పుడు ఆ పాత్రలో నీళ్ళపైన పలచగా నూనె తేలింది. దీంతో ఆ నాణాలు చ‌మురు వ్యాపారివే అని నిర్ధారించాడు.. మాంసం వ్యాపారిని క‌ఠినంగా శిక్షించాడు.

Admin

Recent Posts