Off Beat

నా స్నేహితుడు 6 నెల‌లుగా ఇంటి అద్దె క‌ట్టలేక‌పోతున్నాడు.. ఏం చేయాలి..?

నా మిత్రుడు హైద్రాబాద్ వచ్చి అద్దె ఇంట్లో ఆరు నెలలుగా అద్దె కూడా కట్టలేని దుస్థితిలో ఉన్నాడు. ఆ ఇంటి వారు ఉన్నఫలంగా అద్దె చెల్లించి ఖాళీ చేయమంటున్నారు ఒక నెల గడువు అడిగిన వారు ఇవ్వటం లేదు ఏమి చేయాలి?

నేనుండే గ్రామంలో మా ఇంటికి రెండు వీధుల అవతల ఒక చిన్న ఇంటిలో సుమారు 20 ఏళ్లున్న అమ్మాయి, వారి తండ్రి (సుమారు 60 ఉండొచ్చు) ఉంటారు. రెండేళ్ల నుంచి చూస్తున్నా. కేవలం రెండు గదులు ముందు open terrace ఉన్నవంతే. అద్దె సుమారు 1000, లేక 1500 మించి ఉండదు (చిన్న ఊరు కదా!). ఈ రోజు సాయంత్రం 7 గంటల ప్రాంతంలో మా ఇంటి మీద మీద వాకింగ్ చేస్తుండగా కలకలం మొదలైంది. ఇంటి యజమాని వేరింటికి వచ్చి 4 నెలల నుంచి అద్దె కట్టడం లేదని గొడవ పడుతున్నాడు. మా ఊరిలో శబ్ద కాలుష్యం తక్కువ కాబట్టి మాటలన్నీ వినిపిస్తున్నవి. నానా మాటలు అన్నాడండీ! ఆ పిల్ల ముందే తండ్రిని బూతులు తిట్టారు. ఆత్మ గౌరవం గోదాట్లో కలిసింది.

గుమ్మం ముందు ఆమె నిలబడింది- లోపలికి వచ్చి తండ్రిని తన్నకుండా అనుకుంటా. యజమాని కూడా ఆమెని దాటి లేదా నెట్టుకుని లోపలికి వెళ్లే ప్రయత్నం చెయ్యలేదు కానీ, tenants పరువు గంగలో కలిసిపోయింది. ఒక 10 నిముషాల తర్వాత యజమాని వెళ్ళిపోయాడు, వీరు లోపలికి వెళ్ళి తలుపు వేసుకున్నారు. ప్రశ్న కు వస్తే.. మిత్రుడు అంటున్నారు. సమస్యలో ఉన్న మిత్రునికి మనం ఏం చేసాం అని ఆలోచించాలి. ఆరు నెలలు గా అంటున్నారు, ఉన్నపళంగా ఖాళీ చేయమంటున్నారు అంటున్నారు. అదెలా సాధ్యం? 6 నెలలు సమయం ఇచ్చారు హైదరాబాద్ లో అంటే, అది అత్యద్భుతం, అసాధారణ అదృష్టం. 6 నెలల తరువాత కూడా మళ్లీ గడువు అడగటం అసలు భావ్యమా? సమర్థించునేందుకు అసలు ఏమన్నా మిగిలి ఉందా?

my friend is unable to pay room rent from 6 months what to do

అద్దె కూడా కట్టలేని దుస్థితి ఎందుకు వచ్చింది? అందుకు ఇంటి యజమాని ఏమన్నా బాధ్యుడా? కానప్పుడు ఆ దుస్థితికి ఇంటి యజమాని ఎందుకు suffer అవాలి? అసలు logic ఏమన్నా ఉందా? 6 నెలలు భరించారు అంటే అది చాలా గొప్ప విషయం. దానికి యజమానికి తగిన గౌరవం ఇచ్చి దండం పెట్టి తక్షణం ఖాళీ చేయాలి. మిత్రుడు సమస్య ఏమిటి? ఆదాయం లేదా లేక ఉద్దేశం లేదా? వ్యసనాలుంటే- ఇక నమస్కారం. హైదరాబాద్ లో ఏదో ఒక చోట పని వెతుక్కోవాలి, ఆదాయం తెచ్చుకుని రెంట్ ఇతర బిల్స్ pay చేయాలి. Unskilled, semi skilled, skilled, professionals, ఇలా అందరికీ ఏదో ఒక ఉపాధి అవకాశాలు తప్పక దొరుకుతాయి.

కేవలం చేసే ఉద్దేశం లేకున్నా లేక వ్యసనాలున్నా ఇంకేం చేయలేం. అటువంటి స్థితిలో ఇంటి యజమానితో ఏదో బతిమాలి, dues ఉన్నంతలో కొంత తగ్గించుకుని, pay చేసి బయట పడాలి. అంతే కానీ, సొల్లు కబుర్లు చెప్తూ, victim card play చేస్తూ, ఆత్మాభిమానం గౌరవం చంపుకుని, అసమర్ధతకు ఏ బాధ్యత లేని ఇంటి యజమానిని తిప్పలు పెడుతూ ఉండొద్దు. తక్షణం బయట పడాలి. రెండు పార్టీలకీ మంచిది.

Admin

Recent Posts