Off Beat

ప్రేయసి మోసం చేసిందని ఆత్మహత్య చేసుకొనే వారిని చూసా కానీ,….

<p style&equals;"text-align&colon; justify&semi;">నా పేరు పరమేష్&comma; నాకు చిన్నప్పటి నుండి స్టడీస్ అంటే చాలా ఇష్టం&comma; చదువే నా ప్రపంచం అనుకుంటూ పెరిగాను&comma; ఇంటర్ వరకు నా జీవితం హాయిగా సాగిపోయింది&period; బాగా చదివేవాడిని కాబట్టి ఇంట్లో నన్ను ఎవరు తిట్టేవారు కాదు&comma; చుట్టు పక్కల వారు కూడా బాగా రెస్పెక్ట్ ఇచ్చేవారు&period; ఎంసెట్ లో మంచి ర్యాంక్ వచ్చింది&period; హైదరాబాద్ లోనే టాప్ మోస్ట్ ఇంజనీరింగ్ కాలేజీ లో సీట్ వచ్చింది&period; మొదటి సంవత్సరం పూర్తయ్యాక మంచి జాబ్ సంపాదించగలను అనే నమ్మకం వచ్చింది&period; రెండో సంవత్సరం పూర్తయ్యాక ఆ నమ్మకం మరింత పెరిగింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిన్నప్పటి నుండి చదువుకి à°¦‌గ్గరగా&comma; అమ్మాయిలకు దూరంగా పెరిగాను&period; ఇంజనీరింగ్ చేసిన రెండు సంవత్సరాల్లో కూడా ఏ అమ్మాయితోనూ పరిచయం పెట్టుకోలేదు&period; ఇంకో రెండేళ్లు ఇలాగే కష్ట పడితే జీవితం సెటిల్ అయిపోద్ది అని డిసైడ్ అయ్యా&period; అప్పుడు వచ్చింది నా జీవితం లోకి ఒక అమ్మాయి&period; మా మామయ్య కూతురు కూడా నేను చదివే కాలేజీ లోనే జాయిన్ అయ్యింది&period; నేను బి&period;టెక్ మూడో సంవత్సరం లో చదువుతున్నప్పుడు తను మా కాలేజీ లో జాయిన్ అయ్యింది&period; తను బి&period;టెక్ మొదటి సంవత్సరం చదువుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-72044 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;love-1&period;jpg" alt&equals;"what i have told to my lover she is in hospital " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మామయ్య కూతురు కావడం తో తన వెన్నంటే ఉండి స్టడీస్ లో కానీ&comma; కాలేజీ లో కానీ తనకి ప్రాబ్లమ్ రాకుండా చూసుకున్నా&period; తనకి నా మీద ఎప్పుటినుండి ఇష్టం ఉందో తెలియదు&comma; ఒక రోజు నేను నిన్ను ప్రేమిస్తున్నా బావ అని చెప్పింది&comma; తను నాకు ప్రొపోజ్ చేసిన సమయం లో నేను బి&period;టెక్ 4à°µ సంవత్సరం చదువుతున్నా&comma; ఆ టైం కి మాకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ మొదలవటం తో మంచి ఉద్యోగం తెచ్చుకోవాలనే ఉద్దేశం తో తన ప్రపోసల్ ని అప్పుడు ఒప్పుకోలేదు&period; నాకు కూడా తనంటే చాలా ఇష్టం&comma; కానీ మంచి ఉద్యోగం వచ్చాక ఏకంగా తనని పెళ్లి చేసుకోవాలనుకున్నా&comma; అందుకే నువ్వంటే నాకు ఇష్టం లేదని తనతో కావాలనే అన్నాను&comma; నేను చెప్పిన మాటలను తను సీరియస్ గా తీసుకుంది&comma; కొన్ని రోజుల తరువాత ఆ బాధలో తను విషం తాగింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తను విషం తాగిందని తెలియడంతో ఒక్క సారిగా నేను స్తంభించి పోయా&comma; కొన ఊపిరితో ఉన్న తనను హాస్పిటల్ లో అడ్మిట్ చేసారు&comma; తను చనిపోతే నేను కూడా చనిపోదాం అని నిర్ణయించుకున్నా&comma; కానీ అదృష్టవశాత్తు బ్రతికింది&period; తను కళ్ళు తెరిచిన వెంటనే తన మెడలో హాస్పిటల్ లోనే తాళి కట్టాను అందరి సమక్షం లో&comma; ఉద్యోగం వచ్చాక పెళ్లి చేసుకోవాలనుకున్నా&comma; కానీ ఉద్యోగం వస్తే ఇలా హాస్పిటల్ లో పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని అనుకోలేదు&period; ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందే తెలిసుంటే నేనే నీకు ఎప్పుడో ప్రొపోజ్ చేసేవాడిని అని తనతో చెప్పా&period; ఆ నిమిషం తన కళ్ళల్లో ఆనందం చూసాక నా మనసులో ఏదో తెలియని సంతోషం&comma; కొత్తగా జన్మించినట్టు అనిపించింది&period; నాకు ఆ రోజు కలిగిన సంతోషం నేను ఎన్ని మంచి మార్కులు తెచ్చుకున్నా&comma; పెద్ద ఉద్యోగం చేసినా నాకు కలగలేదు&period; బహుశా ప్రేమంటే అంతేనేమో&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts