Off Beat

కోర్టులో న్యాయదేవత కళ్ళకి గంతలు ఎందుకు ఉంటాయి?

న్యాయ దేవత కళ్ళకు గంతలు ఎందుకు ఉంటాయి అనే ప్రశ్న అందరికీ ఎదురవుతుంది. అయితే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 16వ శతాబ్దం నుండి న్యాయదేవత తరచుగా కళ్ళకు గంతలు కట్టుకొని చిత్రీకరించబడింది. కళ్ళకు గంతలు నిష్పాక్షికతకు సూచన. సంపద, అధికారం లేదా ఇతర హోదాతో సంబంధం లేకుండా న్యాయం వర్తించాలని ఆదర్శం. ఈజిప్షియన్స్ కాలంలో మాట్ అనే దేవతను సత్యానికి, న్యాయానికి ప్రతీకగా అనుకునేవారు.

అయితే మనం ఇప్పటి కాలంలో చూస్తున్నది ఈ ఈజిప్షియన్స్ దేవతను కాదు. యుస్టిషియా లేదా జ‌స్టీషియా అని పిలవబడే ప్రాచీన రోమన్ కళలో, న్యాయదేవతకు ఇచ్చిన రూపం కింద ఇవ్వబడింది. ఇది గ్రీకు దేవత అయిన డైక్ తో సమానం అయినదిగా భావిస్తారు. ఒక తూకం, ఒక కత్తి, కళ్ళకు గంతలు ఇవి న్యాయదేవతకు చిహ్నాలుగా 16వ శతాబ్దం నుండి ఉన్నాయి. ఆమె కళ్ళ గంతలు ప్రతికాత్మకం. ఒక వ్యక్తి జాతి, లింగం, సంపద, అధికారం లేదా న్యాయాన్ని ప్రభావితం చేసే ఇతర అంశాలను న్యాయదేవత చూడదని, ఆమె నిష్పక్షపాతంగా ఉంటుందని, ఆమె మనుషుల్లో విభేదాలకు, వ్యత్యాసాల పట్ల గుడ్డిగా ఉంటుందని అర్థం.

why law goddess covers eyes with black cloth

న్యాయం పక్షపాతం లేకుండా అందజేయబడుతుంది అని అర్థం. కత్తి ఎల్లప్పుడూ తూకం కంటే కింద బాగాన ఉంటుంది. ఎందుకంటే సాక్ష్యం తూకం వేసిన తర్వాత, అంటే నేరం రుజువైతేనే శిక్ష విధించబడుతుంది అని చెప్పటానికి సూచన. అయితే అలానే ఉండాలని విధివిధానాలు ఏం లేవు. ఒక్కోచోట ఒక్కోలా న్యాయదేవత దర్శనమిస్తుంది.

Admin

Recent Posts