Business Ideas : ఎకో ఫ్రెండ్లీ పేపర్ బ్యాగుల తయారీ బిజినెస్‌తో నెలకు 2 లక్షల వరకు లాభం..!
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇప్పుడు ప్లాస్టిక్ ఉత్పత్తుల వినియోగం బాగా తగ్గుతోంది. ముఖ్యంగా జనాలు ప్లాస్టిక్ కవర్లకు బదులుగా పేపర్‌తో తయారు చేసిన ఎకో ఫ్రెండ్లీ బ్యాగులను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు ఆ తరహా ఉత్పత్తులను ఎక్కువగా వాడాలని ప్రభుత్వాలు కూడా సూచిస్తున్నాయి. దీంతో పేపర్ బ్యాగుల వినియోగం ఎక్కువైంది. అయితే ఆ బ్యాగులను తయారు చేసే బిజినెస్ పెట్టుకుంటే.. ఎవరైనా సరే.. చక్కని ఉపాధి పొందవచ్చు. దీనికి మార్కెటింగ్ కూడా చాలా సులభంగా…