అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

మ‌ధ్యాహ్నం నిద్ర మంచిదే కానీ.. అక్క‌డే ఉంది అస‌లు కిటుకు..

చాలామందికి మధ్యాహ్నం నిద్రపోయే అలవాటు ఉంటుంది. నిజంగానే మధ్యాహ్న భోజనం చేసాక ఓ చిన్న కునుకు తీస్తే ఆ సుఖమే వేరు. ఫుల్ గా పంచభక్ష పరమాన్నాలతో భోజనం అయ్యాక నిద్రలోకి జారుకుంటే స్వర్గం కనిపిస్తుంది. అందుక‌నే చాలా మంది ఆఫీసుల్లో ప‌నిచేస్తున్న‌ప్ప‌టికీ మ‌ధ్యాహ్నం లంచ్ చేయ‌గానే విప‌రీత‌మైన ఆవులింత‌లు వ‌చ్చి నిద్ర‌లోకి జారుకుంటారు. అయితే వాస్త‌వానికి మ‌ధ్యాహ్నం నిద్ర మంచిదే అయిన‌ప్ప‌టికీ కొద్ది సేపే నిద్రించాల‌ట‌.

కానీ ఆ నిద్ర 90 నిమిషాలు దాటితే మాత్రం డేంజర్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మధ్యాహ్నం నిద్రపోయే అలవాటు ఉన్న వారు 90 నిమిషాల లోపే నిద్రపోవాలట. అంతకంటే ఎక్కువ సేపు నిద్రపోతే గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

afternoon sleep is good for body but here is the catch

అసలు ఆరోగ్యకరమైన నిద్ర కేవలం రాత్రి సమాయాల్లోనే అని, అది కూడా ఏడు నుంచి పది గంటల వరకు మాత్రమే నిద్రపోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అది కూడా వయసును బట్టి నిద్రపోవాలి అని చెబుతున్నారు.

Admin

Recent Posts