డ్యాన్స్ చేస్తే యువతలో వచ్చే బ్లడ్ షుగర్ నియంత్రించవచ్చట. టెలివజన్ షోలలో వచ్చే నేటి వివిధ రకాల డ్యాన్స్ లు యువతలో ఆధునికంగా వస్తున్న షుగర్ వ్యాధిని నియంత్రిస్తున్నట్లు పరిశోధకులు చెపుతున్నారు. అమెరికా దేశంలో పిల్లలు ఊబకాయాలతో బరువెక్కి షుగర్ వ్యాధి తెచ్చిపెట్టుకుంటున్నారు. వాటిని తగ్గించుకోలేక నానా అవస్ధలు పడుతున్నారు.
అయితే ఈ పిల్లలు ఏరోబిక్ వ్యాయామాలు, డ్యాన్స్ వంటివి చేస్తూ వుంటే వారి షుగర్ స్ధాయి నియంత్రణలోకి వచ్చేస్తోందని తాజాగా ఫిలడెల్ఫియాలోని ఒక పరిశోధనా సంస్ధ యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వానియా స్కూల్ ఆఫ్ నర్సింగ్ తో కలిసి చేసిన పరిశోధనలో తేలింది. వీరి పరిశోధనలో డ్యాన్స్ తరగతిలో విద్యార్ధులు ఇతర రోజులలో వారు వేసే అడుగులకంటే కూడా రెండు రెట్లు అధికంగా అడుగులువేసి శరీర శ్రమను కలిగించుకుంటున్నారట.
కనుక డ్యాన్సింగ్ అనేది ఉచితమైన సాంస్కృతిక కార్యక్రమమే కానవసరంలేదు, షుగర్ వ్యాధిని తగ్గించేందుకు చురుకైన ఒక జీవన విధానంగా కూడా మార్చుకోడానికి తేలికగా అందుబాటులో వుందని, ఇకపై స్కూళ్ళలో విద్యార్ధుల ఆరోగ్యానికై ఆరోగ్య నిపుణులు డ్యాన్స్ ను తరగతి గదిలో ఒక బోధనా అంశంగా కూడా ప్రవేశపెట్టాలని అధ్యయన కర్త టెర్రి లిప్ మాన్ వెల్లడించారు.