అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

రోజూ 4 క‌ప్పుల కాఫీని తాగితే క‌లిగే లాభాలు ఇవే..!

ప్రతిరోజూ నాలుగు కప్పులు కాఫీ తాగితే డయాబెటీస్ వ్యాధి కలిగే అవకాశాలను తగ్గిస్తుందంటున్నారు రీసెర్చర్లు. యూరోప్ లోని ఒక పరిశోధనా సంస్ధ ఆరోగ్యకర జీవన విధానాలు – ఆహారం అనే అంశంపై చేసిన పరిశోధనలో ప్రతిరోజూ నాలుగు నుండి ఐదు కప్పుల కాఫీ తాగితే డయాబెటీస్ వచ్చే అవకాశం 30 శాతం తగ్గుతుందని తెలిపింది. అంతేకాదు, గుండె జబ్బులు, లేదా కేన్సర్ వంటి మొండి రోగాలు కూడా రావని తెలిపినట్లు ది డైలీ మెయిల్ పత్రిక తెలిపింది.

ఈ ఏజన్సీ నిర్వహించిన పరిశోధనలో సుమారు తొమ్మిది సంవత్సరాల పాటు 42,659 మంది వ్యక్తులు పాల్గొన్నారు. వారిలో టైప్ 2 డయాబెటీస్ వ్యాధికలవారు 1,432 కాగా గుండె సంబంధిత వ్యాధులున్నవారు 394 మంది, గుండెపోటు, కేన్సర్లున్నవారు 1,801 మంది వున్నట్లు వెల్లడించారు.

drink coffee daily 4 times for these health benefits

కాఫీలో వుండే కేఫైన్ అనే పదార్ధం డయాబెటీస్, గుండెజబ్బులు తగ్గించేందుకు తోడ్పడటమే కాక, బాగా అలసిన వారికి ఉత్తేజాన్నిచ్చి మరో మారు వారు తమ పనులు ఉత్సాహంతో చేసుకోడానికి తోడ్పడుతుందని, ప్రత్యేకించి, రహదారుల ప్రయాణంలో వున్న డ్రైవర్లకు ఎంతో శక్తినిచ్చి వారు మెళకువతో ప్రయాణించేలా చేస్తుందని నెదర్లాండ్స్ లోని యుట్రెచ్ యూనివర్శిటీ సైంటిస్టులు వెల్లడించారు. ఒక కప్పు కాఫీ సుమారు నాల్గు గంటలపాటు మనిషిలో ఉత్తేజాన్నిస్తుందని వీరు తమ పరిశోధనలో తెలిపారు.

Admin

Recent Posts