అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

రోజూ కాఫీ తాగుతున్నారా.. అయితే మీకు గుడ్ న్యూస్‌..

కాఫీ ప్రియులకు శుభవార్త…. ! కాఫీ చాలాకాలంనుండి తాగే వారికి ఎండోమెట్రియల్ కేన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుందని ఒక తాజా పరిశోధన చెపుతోంది. అధికబరువు, ఈస్ట్రోజన్ మరియు ఇన్సులిన్ సంబంధిత కేన్సర్లనుండి రక్షణకు కాఫీ దివ్యమైన ఔషధం అని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ రీసెర్చర్ ఎడ్వర్డ్ జియోవానుక్కి వెల్లడించారు.

ఇప్పటికే కాఫీ శరీరంలోని ఇన్సులిన్ ను ప్రభావిస్తుండటంతో దానిని డయాబెటీస్ కు మెడిసిన్ గా కూడా పరిగణిస్తున్నట్లు ఈ సీనియర్ రీసెర్చర్ తన స్టడీలో పేర్కొన్నారు. ఈ పరిశోధనను ఆయన తన సహచరులతో కలిసి సుమారు 67 వేలమంది మహిళలపై ప్రయోగించి ఫలితాల‌ను కనుగొనన్నారు.

if you are drinking coffee daily then it is good for you

26 ఏళ్ళపాటు సాగిన ఈ పరిశోధనలో సుమారు 672 కేసుల ఎండోమెట్రియల్ కేన్సర్ పరిశోధించారు. రోజుకు 4 కప్పుల కన్నా అధికంగా తాగేవారికి 25 శాతం రిస్కు తక్కువగా వుందన్నారు. ఈ స్టడీ అంశాలను అమెరికన్ అసోసియేషన్ ఫర్ కేన్సర్ రీసెర్చి సంస్ధ దాని జర్నల్ కేన్సర్ ఎపిడెమిలజీ లో ప్రచురించింది.

Admin

Recent Posts