అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

మీరు పోష‌కాహార లోపంతో బాధ‌ప‌డుతున్నారా.. అయితే గుండె పోటు వ‌స్తుంద‌ట‌..

పోషకాహార లోపం ప్రత్యేకించి యుక్తవయసులో వుంటే, దాని ప్రభావం వారికి తర్వాతి వయసులో కరోనరీ హార్ట్ డిసీజ్ గా పరిణమిస్తుందని ఒక తాజా అధ్యయనం తెలుపుతోంది. యువతకు చిన్న వయసులో వున్నపుడు కలిగిన తీవ్రపోషకాహార లోపం భవిష్యత్తులో వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఈ స్టడీని యూనివర్శిటీ మెడికల్ సెంటర్ యుట్రెట్ మరియు యూనివర్శిటీ ఆఫ్ ఆమస్టర్ డామ్ పరిశోధకులు రెండవ ప్రపంచయుద్ధం చివరిలో వచ్చిన తీవ్ర కరువు సమయంలో సుమారుగా 7845 మహిళలపై నిర్వహించారు.

రీసెర్చర్లు తమ స్టడీని 1993 – 1997 ల మధ్య ప్రధానంగా మహిళల బ్రెస్ట్ కేన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ గా మొదలుపెట్టి దానిని 2007 వ‌రకు కొనసాగించారు. కరువు సమయంలో దానికి గురై వున్న మహిళలలో గుండె సంబంధిత కరోనరీ వ్యాధులు తీవ్రంగా వచ్చినట్లు తెలిపారు. కరువు సమయంలో ఈ మహిళల వయసు 10 నుండి 17 సంవత్సరాలున్నాయని, వీరికి తర్వాతి వయసులో 38 శాతం అధిక గుండె సంబంధిత రిస్కు కలిగిందని తెలిపారు.

if you are suffering from nutrition deficiency then you will get heart attack

పరిశోధకులు తమ పరిశోధనలో కరువు సమయంలో మహిళల వయసు, వారి విద్య, జీవన విధానం, స్మోకింగ్ వంటి అలవాట్లు అన్నిటికి ప్రాధాన్యతనిచ్చారు. కరువు సమయంలో దాని బారిన పడిన మహిళలకు, కరువంటే తెలియని మహిళల కంటే అధిక సమస్యలున్నాయని నిర్ధారించారు. ఈ స్టడీని యూరోపియన్ హార్ట్ జర్నల్ లో ప్రచురించారు.

Admin

Recent Posts