అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

రోజూ న‌వ్వితే హార్ట్ ఎటాక్ అస‌లు రాద‌ట‌.. సైంటిస్టుల ప‌రిశోధ‌న‌లో వెల్ల‌డి..

నవ్వటంకూడా ఒక మంచి ఆహారం లాంటిదేనంటారు రీసెర్చర్లు. కడుపుబ్బేలా నవ్వేస్తే, గుండెకు రక్త ప్రసరణ అధికమవుతుందని ఒక కొత్త అధ్యయనం తెలుపుతోంది. దేర్ ఈజ్ సమ్ ధింగ్ అబౌట్ మేరీ అనే సినిమా చూసేటపుడు కొన్ని అంశాలు కడుపుబ్బ నవ్వించేవి. చూసిన వ్యక్తులకు రక్తనాళాలు పరిశీలిస్తే అవి వ్యాకోచం చెందాయట.

అయితే వీరికే విచారకరమైన ఫిలిం సేవింగ్ ప్రయివేట్ ర్యాన్ చూపినపుడు అందులోని సంఘటనలకు రక్తనాళాలు కుచించుకుపోయి గుండెకు రక్తప్రసరణ సరిగా జరగలేదట. నవ్విన తర్వాత ఏర్పడే ప్రయోజనాన్ని రీసెర్చర్లు ఒక ఎరొబిక్ వ్యాయామంతో వచ్చే ప్రయోజనంగా గుర్తించారని డెయిలీ ఎక్స్ ప్రెస్ పత్రిక పేర్కొంది.

laugh daily to prevent heart attack

ఈ పరిశోధన యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ లోని ప్రొఫెసర్ మైకేల్ మిల్లరు చేసినట్లు తెలిపింది. గుండె జబ్బులు రాకుండా ఆరోగ్యకరమైన జీవన విధానంలో భాగంగా హాయిగా నవ్వేయటం ఆచరించటం అందరకూ సాధ్యమే నంటారు ఈ రీసెర్చర్.

Admin

Recent Posts