అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

పొలాల దగ్గర పెరిగిన పిల్లలకే….రోగాలు తట్టుకునే శక్తి ఎక్కువ.! ఎందుకో తెలుసా?

ప‌ట్ట‌ణాల్లో పిల్ల‌ల కంటే పొలాల వ‌ద్ద పెరిగిన పిల్ల‌ల‌కు వ్యాధి నిరోద‌క శ‌క్తి ఎక్కువట! భ‌విష్య‌త్ లో రాబోయే వ్యాధులను తట్టుకునే పవర్ పొలాల వద్ద పెరిగిన పిల్లలకే అధికమట! పొలాల వ‌ద్ద ఉండే వాతావర‌ణం లో ఉండే A- 20 అనే ప్రొటిన్ పిల్ల‌ల ఆరోగ్యాన్ని రెట్టింపు చేస్తుంద‌ట.. ఎలుకల మీద ప్రయోగం చేసిన డాక్టర్లు ఈ విషయాన్ని ధృవీకరించారు. స్వఛ్చమైన వాతావరణంతో పాటు ఆరోగ్యాన్ని రెట్టింపు చేసే ప్రొటీన్ కారణంగా ఈ పిల్లలు అన్ని రంగాల్లో ముందుండే అవకాశం ఉందట….శారీరకంగా కూడా ఫిట్ గా ఉంటారంట.!

people who live in villages have more immunity

A-20 ప్రొటీన్ వల్ల కలిగే లాభాలు:

ఈ ప్రొటీన్ శ‌రీరంలోని ఊపిరితిత్తులను జాగ్ర‌త్త‌గా కాపాడుతూ అస్త‌మా రాకుండా అడ్డుకుంటుందంట‌. శ్వాస ప్రక్రియ సజావుగా సాగితే దాదాపు సగం రోగాలు మన ధరి చేరవు. ఈ ప్రొటీన్ శరీరానికి అల‌ర్జీలను త‌ట్టుకునే శ‌క్తినిస్తుంది.

వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. వ్యాధి నిరోధక శక్తి బలంగా ఉంటే…..ఎటువంటి రోగాల నుండైనా తప్పించుకోవొచ్చు. దేహధారుడ్యానికి ఈ ప్రొటీన్ సహాకరిస్తుంది. సో….ఫైనల్ గా చెప్పేదేంటంటే….. సంవత్సరంలో కొన్ని రోజులైనా మన పల్లెటూర్లకు వెళ్దాం. మన పొలాలను…మన చెరువులను, మన పల్లెటూరి ప్రకృతిని పలకరించి వద్దాం.

Admin

Recent Posts