అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

ఈ కాఫీని తాగితే ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉంటాయ‌ట‌..!

కాఫీలో కెఫిన్‌ ఉంటుంది. ఇది తాగితే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఏదో తాగినప్పుడు ఫీల్‌ బాగుంటుందనే కానీ.. ఆరోగ్యానికి మంచిది కాదంటారు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే కాఫీతో మంచి ప్రయోజనాలు ఉన్నాయట. ఈ కాఫీ మనసు, మెదడుకి హాయినిస్తుంది. అంతే కాదు ఇది మతిమరుపు సమస్యని కూడా దూరం చేస్తుందని కొత్త అధ్యయనం చెబుతోంది. ఎస్ప్రెస్సో కాఫీ తాగడం వల్ల అల్జీమర్స్ వ్యాధి లక్షణాలని నిరోధించవచ్చని ఇటాలియన్ పరిశోధకులు కనుగొన్నారు. ఈ పానీయం మెదడు కణాలకు ప్రోటీన్ క్లంప్‌లు విషపూరితం కాకుండా చేస్తుంది. దీని వల్ల చిత్త వైకల్యానికి దారి తీసే అవకాశం తక్కువగా ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. అల్జీమర్స్ అనేది టౌ, అమిలాయిడ్‌తో సహా మెదడులోని ప్రోటీన్ నిర్మాణాల వల్ల సంభవిస్తుంది. మతిమరుపు సహా అనేక వ్యాధుల నుంచి రక్షించడానికి కాఫీ సహాయపడుతుందని మునుపటి అధ్యయనాలు సూచిస్తున్నాయి. రోజుకి మూడు నుంచి ఐదు కప్పుల వరకు కాఫీ తాగడం వల్ల మతిమరుపు వచ్చే అవకాశం 65 శాతం తగ్గిస్తుందని ఒక అధ్యయనం సూచించింది.

జర్నల్ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ ఫుడ్ కెమిస్ట్రీలో ప్రచురించిన తాజా అధ్యయనం ప్రకారం.. కాఫీలోని రసాయనాలు టౌ బిల్డ్ అప్ లని నిరోధించగలవా అని పరిశీలించారు. కాఫీలో ఉండే రెండు రసాయనాలు కెఫీన్, జెనిస్టీన్‌లో టౌ ప్రోటీన్ ఉందో లేదో గమనించారు. అవి అల్జీమర్స్ లక్షణాలని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతున్నాయని ఈ పరిశోధనలో తేలింది.

take espresso daily for these health benefits

ఎస్ప్రెస్సో కాఫీ తయారుచేయడానికి స్పెషల్‌గా ఒక మిషన్‌ ఉంటుంది. ఆ మిషన్ సాయంతో అయినా చేసుకోవచ్చు లేదా ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఇందులో పలు రకాలు ఉంటాయి. మతిమరుపు రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ఈరోజుల్లో చాలా మంది ఒంటరిగా ఉండేదుకు ఇష్టపడుతున్నారు. కానీ ఇలా ఒంటరిగా ఉంటే 50 శాతం అల్జీమర్స్‌ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట. మీలో భావాలను ఇతరులతో పంచుకున్నప్పుడే మీరు హ్యాపీగా ఉండగలుగుతారు. అయితే అలా షేర్‌ చేసుకోవడానికి కూడా మనకు ఒకరు కావాలి. అలా ఎవరూ లేకపోవడం వరమో, శాపమో మీరే ఆలోచించుకోవాలి.!

Admin

Recent Posts