అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

శృంగార సామర్థ్యాన్ని పెంచే ఈ మెడిసిన్‌.. గుండె జ‌బ్బుల‌కు కూడా మంచిదేన‌ట‌..

రతి సామర్ధ్యాన్ని పెంచుకోడానికి వయాగ్రా మెడిసిన్ వాడేయటం అందరికి సాధారణమైంది. ఈ మందు వాడితే రతి సామర్ధ్యం పెరగటమే కాదు, గుండెకు కూడా మేలు చేస్తుందంటున్నారు పరిశోధకులు. వయాగ్రా మెడిసిన్ లోని కొన్ని పదార్ధాలు గుండె కణాలలో గల జైంట్ ప్రొటీన్ తితిన్ ను ఉత్పత్తి చేసే ఒక ఎంజైమును యాక్టివేట్ చేస్తాయని ఒక తాజా పరిశోధనలో వెల్లడైంది. ఆర్ యుబి ఇన్ స్టిట్యూట్ ఫిజియాలజీ లోని పరిశోధకుడు వుల్ఫ్ గాంగ్ లింకే తాము ఈ పరిశోధనలను ప్రస్తుతానికి జంతువులపై పరిశోధించి ఫలితాలు బాగా వున్నట్లు కనుగొన్నామని చెప్పారు.

త్వరలోనే అది గుండె జబ్బులుగల రోగులపై కూడా పరిశోధించి మంచి వైద్యం అందించటంలో సక్సెస్ అవ్వగలమని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ మందులో రక్త నాళాలు రిలాక్స్ చేసే కొన్ని గుణాలు వున్నాయని ఈ కారణంగానే మొదట్లో వయాగ్రా మందు రతి సామర్ధ్యాన్ని పెంచే మందుగా మార్కెట్ లోకి వచ్చిందని వీరు తెలుపుతున్నారు.

viagra tablets can also do good for heart patients

వయాగ్రా కనుక ఆశించిన మేరకు గుండె సంబంధిత సమస్యలకు కూడా ఉపయోగపడితే, ఇకపై వయాగ్రా వాడేవారికి జంట లాభాలు అంటే, ఒకవైపు రతి సామర్ధ్యం కొరకు మరోవైపు, వారికి గుండె సంబంధిత సమస్యలకు జవాబు కాగలదు. కనుక గుండె జబ్బుల రోగులు సైతం యధేచ్ఛగా రతిక్రీడలనాచరించేయవచ్చు.

Admin

Recent Posts