అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

జంట‌లు శృంగారంలో పాల్గొనే యావ‌రేజ్ స‌మ‌యం ఎంతో తెలుసా..?

శృంగార‌మంటే స్త్రీ, పురుషుల మ‌ధ్య జ‌రిగే ఓ ప్ర‌కృతి కార్యమ‌ని అంద‌రికీ తెలిసిందే. సాధార‌ణంగా ఆడ‌, మ‌గ ఇద్ద‌రికీ శృంగారం విష‌యంలో కొన్ని నిర్దిష్ట‌మైన ఆలోచ‌న‌లు, ప్ర‌ణాళిక‌లు ఉంటాయి. ఆ క్ర‌మంలోనే ఇద్ద‌రూ క‌లిసి ర‌తిలో పాల్గొన్న‌ప్పుడు త‌మ అభిరుచులు, ఇష్టాల‌కు అనుగుణంగా ప్ర‌వ‌ర్తిస్తారు. కొంద‌రైతే ఇలాంటి ఇష్టాలు ఏమీ లేకుండానే నేరుగా శృంగారంలోకి దిగిపోతారు. అయితే అది వారి ఇష్ట‌మ‌నుకోండి, అల‌వాటు అనుకోండి, అది వేరే విష‌యం. కానీ ఏ జంట శృంగారంలో పాల్గొన్నా దానికి కొంత స‌మ‌యం అంటూ ఉంటుంది. కొంద‌రు చాలా త్వ‌ర‌గా ముగిస్తే, మరికొంద‌రు సుదీర్ఘంగా కొన‌సాగిస్తారు. అయితే మీకు తెలుసా..? ఏ జంట శృంగారంలో పాల్గొన్నా యావ‌రేజ్‌గా ఆ స‌మ‌యం ఎంత ఉంటుందో..? దాని గురించి ఇప్పుడు చూద్దాం.

ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ న‌గ‌రంలో ఉన్న క్వీన్స్‌లాండ్ యూనివ‌ర్సిటీ సైకాల‌జిస్టు డాక్ట‌ర్ బ్రెండ‌న్ జియ‌ట్చ్ జంటలు శృంగారంలో పాల్గొనే స‌మ‌యంపై ఓ ఆస‌క్తిక‌ర ప‌రిశోధ‌న చేశారు. అదేమిటంటే… అత‌ను ముందుగా 500 మంది జంట‌ల‌ను ఎంచుకున్నారు. వారికి ఓ స్టాప్ వాచ్ ఇచ్చారు. 4 వారాల స‌మ‌యంలో వారు ఎప్పుడు శృంగారంలో పాల్గొన్నా అప్పుడు స్టాప్‌వాచ్ ఆన్ చేయాల‌ని, శృంగారం అయిపోయిన వెంట‌నే స్టాప్ వాచ్ ఆఫ్ చేయాల‌ని చెప్పాడు బ్రెండ‌న్. ఈ క్ర‌మంలో జంట‌లంద‌రూ అలాగే చేశారు. చివ‌రిగా తెలిసిన విష‌యం ఏమిటంటే…

what is the average time of sex of couples

ఏ జంట శృంగారంలో పాల్గొన్నా వారి యావ‌రేజ్ ర‌తి స‌మ‌యం 5 నిమిషాల 40 సెకండ్ల‌ని తేలింది. జంట‌లంద‌రినీ ప‌రిశీలిస్తే వారి ర‌తి స‌మ‌యం 33 సెకండ్ల నుంచి దాదాపు 44 నిమిషాల వ‌ర‌కు ఉంద‌ని, కానీ అంద‌రినీ క‌లిపి యావ‌రేజ్‌గా తీసుకుంటే వారి ర‌తి స‌మ‌యం 5 నిమిషాల 40 సెకండ్ల‌ని తేలింది. దీంతోపాటు బ్రెండ‌న్ మ‌రో విష‌యాన్ని కూడా గ‌మ‌నించాడ‌ట‌. అదేమిటంటే వ‌య‌స్సు ఎక్కువగా ఉన్న వారి ర‌తి స‌మ‌యం చాలా త‌క్కువ‌గా ఉంటుందని. అంతే క‌దా, మ‌రి! అయినా బ్రెండ‌న్ గారూ… ఎంత ప‌రిశోధ‌న అయితే మాత్రం ర‌తి స‌మయం ఎంత ఉంటుందో తెలుసుకోవ‌డం కోసం జంట‌ల‌కు స్టాప్ వాచ్ ఇచ్చి మ‌రీ ప‌రిశోధ‌న చేయాలా..? ఆ స‌మ‌యంలో వారు చెప్ప‌లేని ప్ర‌పంచంలో విహ‌రిస్తుంటారు. అలాంట‌ప్పుడు స్టాప్ వాచ్‌లు ఆన్ చేయ‌డం, ఆఫ్ చేయ‌డం అవ‌స‌ర‌మంటారా..? స‌రే… ఏది ఏమైనా ఓ ముఖ్య‌మైన విష‌యాన్ని జ‌నాల‌కు తెలియ‌జేశారుగా..! అందుకు థ్యాంక్స్‌..!

Admin

Recent Posts