అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

ఆక్యుపంక్చ‌ర్ వైద్యంతో గుండె పోటుకు చెక్ పెట్ట‌వ‌చ్చ‌ట‌..!

ఆక్యుపంక్చర్ వైద్యం అంటే శరీరంలోని కొన్ని ప్రత్యేక భాగాల వద్ద వివిధ జబ్బులను నయం చేయటానికి చర్మంలో సూదులు గుచ్చుతారు. తాజా సమాచారం మేరకు ఆక్యుపంక్చర్ తో గుండె పోటును కూడా అరికట్టవచ్చుట. ఇది నరాల వ్యవస్ధపై పని చేసి అధికంగా గుండెకొట్టుకోడాన్ని, సరిగా లేని రక్తపోటును నియంత్రించటానికి తోడ్పడుతుంది. గుండె పోటుకు కారణం నరాల వ్యవస్ధ అతిగా స్పందించడమే.

కనుక ఈ నరాల కదలికలను ఆక్యుపంక్చర్ తో నియంత్రిస్తే హార్టు ఫెయిల్యూర్ వుండదంటున్నారు. గుండె విఫలతలకు వైద్యంగా ఆక్యుపంక్చర్ ను మొదటిసారిగా యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ లోని అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్ డా. హోలీ ఆర్ మిడిల్ కఫ్ ఉపయోగించారు. 14 మంది గుండె రోగులపై దీనిని ప్రయోగించారు.

with acupuncture heart attack can be prevented

ఆక్యుపంక్చర్ వైద్యం గుండె జబ్బులు కలవారిలో కొంతమందికి చేశారు. చేసిన వారికి నరాల వ్యవస్ధ, రక్తపోటు నియంత్రణ సమర్ధవంతంగా వుండగా, వైద్యం చేయని ఇతర గుండె రోగులకు వ్యతిరేక ఫలితాలు చూపాయి. అయితే, ఈ వైద్యాన్ని మరింత మంది రోగులకు ఇచ్చి ఫలితాలు విస్తృత పరిధిలో పరిశీలించాల్సివుందని ఆయన తెలిపారు. అయితే, క్లినికల్ పరీక్షలలో దీర్ఘకాల ఫలితాలలో ఆక్యుపంక్చర్ వైద్యం ద్వారా హైపర్ టెన్షన్ బాగా తగ్గినట్లు దీని కారణంగా నరాల వ్యవస్ధ ఎంతో ప్రశాంతత పొందినట్లుగా కూడా డా. హోలీ వెల్లడించారు.

Admin

Recent Posts