technology

ఇప్పుడు అందుబాటులో ఉన్న స‌బ్ మెరైన్ల గురించి ఈ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం మీకు తెలుసా..?

వినడానికి ఆశ్చర్యం గా ఉంటుంది, కానీ నిజం.మీడియా, ప్రజల దృష్టిలో పెద్దగా కనపడని ఒక wing గురించి కొంత తెలుసుకుందాము. ఆ తరువాత విషయానికి వస్తాను, అప్పుడే అర్ధం అవుతుంది. సంవత్సరాల తరబడి జలాంతర్గాముల నుంచి వెలువడే శబ్దాన్ని తగ్గించి వాటిని సాధ్యమైనంత నిశ్శబ్దంగా మార్చడం మీద చేసిన కృషి ఫలించింది. ఎంతగా అంటే, ఒక జలాంతర్గామిని వెతుకుతున్నప్పుడు, దాని ఇంజన్ చేసే శబ్దం శత్రువులకి తెలిసే అవకాశం కన్నా జలాంతర్గామి లో toilet lid జాగ్రత్తగా close చేయపోతే తలుపుకి ఉండే బోల్ట్ గట్టిగా వేస్తే crew మాట్లాడుకుంటే … వంటి కారణాల వల్ల వాళ్ళు శత్రువులకి దొరికే అవకాశం ఎక్కువ. 2008 లో అమెరికా జలాంతర్గామి ( అణ్వాయుధాలు కలిగి ఉంది), sudden గా సముద్ర గర్భంలో దేనినో ఢీకొని damage జరిగింది, అది ఢీకొనే వరకూ అందులో ఉన్న technicians ఇంత ఆధునిక పరికరాలు ఉన్నా గుర్తించలేకపోయారు.

ఆ వస్తువు మరేదీ కాదు French వారి జలాంతర్గామి. అది కూడా అణ్వాయుధాలు కలిగి ఉంది. రెండూ ఢీకొనే దాక ఇద్దరిలో ఎవరికీ వేరే వారి ఉనికి తెలియలేదు. రెండూ దెబ్బతిని రిపేర్ వ‌ర్క్ కి వెళ్ళాయి. ఇంకా అవ్వలేదు….. ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడం కోసం అమెరికా దాని మిత్ర దేశాలు ఒక పరిష్కారం కనిపెట్టాయి. మిత్రులు వారి వారి submarines signatures share చేసుకుంటాయి, వాటిని భద్ర పరుచుకుంటే ఒకరిని ఒకరం కనిపెట్టడం తేలిక, ఇలాంటి యాక్సిడెంట్స్ జరగవు అన్న నిర్ణయానికి వచ్చి అమలుచేశారు. అది విజయవంతం అయ్యింది, తరువాత అటువంటి యాక్సిడెంట్స్ జరగలేదు.

do know this specialty of latest sub marines

2018 లో చైనా వారు ఆ డేటాబేస్ ni hack చేసి రహస్యమైన వివిద దేశాల జలాంతర్గాముల signature లు కొంత వరకూ దొంగలించారు. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిన విధం గా అయ్యింది. ఇప్పుడు noise, signature మాత్రమే కాకుండా, acoustic hole కోసం వెతకడం ప్రారంభించారు. అంటే, శత్రువు కోసం వెతుకుతున్నప్పుడు సముద్ర గర్భంలో ఏదైనా ప్రాంతంలో ఎటువంటి అలజడి లేకుండా మరీ silent గా ఆ ప్రాంతం ఉంటే అక్కడ వేరే జలాంతర్గామి ఉంది అని అంచనాకు వస్తారు.

Admin

Recent Posts