technology

వాట్సాప్‌, టెలిగ్రామ్‌ల‌కు ఇక కాలం చెల్లిన‌ట్లే.. కొత్త చాట్ యాప్ తెస్తున్న ఎలాన్ మస్క్‌..?

ఎలాన్ మస్క్ యొక్క ఎక్స్ యాప్ లో కొత్తగా ఎక్స్‌ చాట్ (XChat) పేరుతో ఒక చాట్ ఇంటర్ఫేస్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఇది వాట్సాప్ కు పోటీగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ XChat ద్వారా ఫోన్ నంబర్ లేకుండా ఆడియో, వీడియో కాల్స్ చేయవచ్చు. ఈ వారం లోపే ఈ యాప్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఎలాన్ మస్క్ ఈ XChat గురించి తన ఎక్స్ వేదిక ద్వారా ప్రకటించారు. ఈ XChat లో end-to-end encryption, disappearing messages, ఆడియో/వీడియో కాల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. XChat ని X యూజర్ల కోసం రూపొందించారు. ఇది ఇప్పటికే ఉన్న X ప్లాట్‌ఫారమ్ పై డైరెక్ట్ మెసేజింగ్ సిస్టమ్ ద్వారా పనిచేస్తుంది.

elon musk bringing xchat new messaging app

అయితే ఫోన్ నెంబర్ ఉండి కూడా చాలా ఘోరాలు జరుగుతున్నాయి.. వేదింపులు, ఉగ్రవాదం కూడా.. ఫోన్ నంబర్ లేకపోతే ఇంకెంత విచ్చలవిడితనం ఉంటుందో.. ఎంత క్రైమ్ పెరుగుతుందో చెప్పలేము… ఇలాంటి విధానాన్ని నిలువరించడమే ఉత్తమం… అని నిపుణులు అంటున్నారు.

Admin

Recent Posts