technology

స్మార్ట్ ఫోన్ నీటిలో పడిందా.. అయితే ఇలా చేయండి..!

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ అనేది తప్పనిసరి అయిపోయింది. అయితే ఈ ఫోన్లు మనం పాకెట్ లో పెట్టుకున్నప్పుడు గానీ ఇతరాత్ర పనుల్లో ఉన్నప్పుడు జారి నీటిలో పడి పోవడం జరుగుతూ ఉంటుంది. అయితే అలా నీటిలో పడ్డప్పుడు మనం వెంటనే ఇలా ఈ జాగ్రత్తలు పాటిస్తే మళ్లీ ఫోన్ మామూలు స్థితికి వస్తుంది. లేదంటే అంతే.. మరి అవేంటో ఒక సారి చూద్దాం.

ఫోన్ నీటిలో పడ్డప్పుడు మనం వీలైనంత త్వరగా దాన్ని అందులో నుంచి తీయాలి. లేదంటే నీరు ఫోన్ లో ని అన్ని భాగాల్లోకి చేరుతుంది. నీటిలో పడగానే చేయకూడని పనులు: మొబైల్ ఫోన్ ను వెంటనే ఆన్ చేయవద్దు. చార్జింగ్ అస్సలు పెట్టవద్దు. ఫోన్ పై బటన్ లు ఉంటే నొక్క వద్దు. ఫోను అటు ఇటు ఎక్కువగా కదిలించవద్దు. ఇలా చేస్తే నీరు ఫోన్ అంతర్గత భాగాలకు కూడా వెళుతుంది. వేడిగా ఉన్న దగ్గర అస్సలు పెట్టవద్దు.

put your smart phone in rice if it drops in water

ఆఫ్ చేసి దాన్ని నిటారుగా పట్టుకొండి. సిమ్ ను తొలగించండి. ఒకవేళ పాత ఫోన్ అయితే మాత్రం వెంటనే వెనుక భాగంలో ఉన్న బ్యాటరీని తొలగించాలి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మొబైల్ రిపేర్ షాప్ కి తీసుకెళ్లడం ఉత్తమం. ఫోనును వస్త్రం లేదా పేపర్ మీద ఆరబెట్టండి. బియ్యం సంచిలో పాతి పెట్టండి. ఎందుకంటే బియ్యం ద్రవాలను పీల్చుకోవడానికి అనువైనది. ఫోను ఒకటి లేదా రెండు రోజులు ఆరనివ్వాలి.

Admin

Recent Posts