technology

ఒకప్పుడు టీవీలకు, ఫ్రిజ్‌ లకు వాడే స్టెబిలైజర్లు ఇప్పడు ఎందుకు ప్రజాదరణ కోల్పోయాయి?

11Kv lines నుండి LT(low tension), LT నుండి ట్రాన్స్ఫార్మర్ ద్వారా 240V కి స్టెప్ డౌన్ చేసిన కరెంటు ఇంటికి వస్తుంది. అదే అపార్ట్మెంట్ కి డైరెక్ట్ 11Kv నుండి ట్రాన్స్ఫార్మర్ ద్వారా 240 స్టెప్ డౌన్ చేసి అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కి 240V వెళ్తుంది. ఇంట్లో ఉండే అన్ని ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్ 240V input తో నడుస్తాయి. అంతకంటే ఎక్కువ లేదా తక్కువ కరెంటు వచ్చినప్పుడు ఫ్లక్చువేషన్స్ వచ్చి వస్తువులు కాలిపోతాయి.

ఒకప్పుడు ట్రాన్స్ఫార్మర్లు ఎక్కువ ఉండేవి కాదు. ఒక ట్రాన్స్ఫార్మర్ నుండి వచ్చిన LT లైన్ కి పరిమితికి మించి ఎక్కువ ఇండ్లకు కనెక్షన్ ఇవ్వడం వలన అందరికీ 240V కాకుండా ఒకరికి ఎక్కువ లేదా తక్కువ కరెంటు వచ్చేది. ఈ క్రమంలోనే స్టెబిలైజర్ సరిగ్గా 240V ఉండేలా చూస్తుంది. అందుకే అప్పట్లో స్టెబిలైజర్ ని చాలా ఎక్కువగా వాడేవారు.

why people are not using stabilisers these days

కానీ ఇప్పుడు ఒక ట్రాన్స్ఫార్మర్ నుండి ఎన్ని ఇండ్లకు కనెస్క్షన్ ఇవ్వాలో ఖచ్చితంగా అన్నిటికీ మాత్రమే ఇస్తున్నారు. దానిద్వారా విద్యుత్ లో హెచ్చుతగ్గులు లేవు, దానితో పాటు ఇప్పుడు అన్ని ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్ లో 200V నుండి 300V హెచ్చుతగ్గులను తట్టుకునేలా ఇన్బిల్ట్ స్టెబిలైజర్ ని అమరుస్తున్నారు. అందుకే ఇప్పుడు స్టెబిలైజర్ అవసరం లేకుండా పోయింది. కానీ ఇండిపెండెంట్ ఇళ్లు కలిగి ఉన్నవాళ్లు టీవీ కి స్టెబిలైజర్ ని పెట్టుకుంటే మంచిది.

Admin

Recent Posts