vastu

నిమ్మ‌కాయ‌ల‌తో ఇలా చేస్తే నెగెటివ్ ఎన‌ర్జీ ఉండ‌దు.. స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌తారు..

మనకు ప్రకృతి సిద్ధంగా లభించే ఆకులు, కాయల నుండి ఎన్నో ఉపయోగాలున్నాయన్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. తినటం.. త్రాగటం వల్లనే కాకుండా వాసన చూడటం వలన కూడా ఒనగూరే ఉపయోగాలు తెలుసుకుందాం ఇప్పుడు. మరీ ముఖ్యంగా నిమ్మకాయలను ముక్కలుగా కోసి మన ఇంట్లో ఉంచడం వలన మనం ఏయే ఫలితాలు పొందవచ్చొ ఇప్పుడు తెలుసుకొందాం.

నిమ్మకాయలు అంటేనే ఒక పాజిటివ్ ఎనర్జీ.. అటువంటి నిమ్మకాయ ముక్కల నుండి వచ్చే వాసన మనకు డిప్రెషన్ వంటి మానసిక జబ్బులనుండి దూరం చేస్తుంది.ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఎప్పుడు మనలో ఉంటుంది. గాలి కూడా శుద్ధి అయ్యి స్వచ్ఛముగా మారుతుంది.

do like this with lemon to get rid of negative energy

మన ఊపిరితిత్తుల పని తీరు కూడా మెరుగవుతుంది. కొంతమందికి బస్సు జర్నీ పడనపుడు వారి వెంట నిమ్మకాయలను తీసుకువెళ్లే విషయం మనందరికీ తెలిసిన విషయమే.. కడుపులో తిప్పడం.. వికారం తగ్గిపోయి వారి ప్రయాణానికి ఇబ్బంది కలుగకుండా సహకరిస్తుంది. ఇంట్లో అక్క‌డ‌క్కడా నిమ్మ‌కాయ ముక్క‌ల‌ను కోసి పెడితే నిమ్మ‌వాస‌న వ‌స్తుంది. ఇది కొత్త ఫీలింగ్‌ను, తాజాద‌న‌పు అనుభూతిని క‌లిగిస్తుంది. నిమ్మ‌కాయ‌ల‌తో దిష్టి కూడా తీయ‌వ‌చ్చు. ఇది పాజిటివ్ ఎన‌ర్జీని ప్ర‌సారం చేస్తుంది. నెగెటివ్ ఎన‌ర్జీని దూరం చేసి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తుంది.

Admin

Recent Posts