vastu

ఇంట్లో ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ వ‌స్తువుల‌ను పెట్టుకోకండి.. లేదంటే అన్నీ స‌మ‌స్య‌లే వ‌స్తాయి..

ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కలిగి అంతా మంచే జరగాలంటే.. కచ్చితంగా వీటిని పాటించాలి వాస్తు ప్రకారం మనం ఫాలో అవ్వడం వలన అంతా మంచే జరుగుతుంది. ఇబ్బందుల నుండి బయటపడొచ్చు. ఏ సమస్య లేకుండా హాయిగా ఉండొచ్చు. చాలామంది ఇంట్లో పాత సామాన్లని పనికిరాని వస్తువుల్ని ఎక్కువగా పెడుతుంటారు. వీటి వలన నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి వచ్చి ఇబ్బందుల్ని తీసుకువస్తుంది. సమస్యల్లో ముంచుతుంది.

ఎక్కువగా చెత్తాచెదారం ఇంట్లో ఉండడం వలన దుమ్ము ధూళి మాత్రమే కాదు ఆ ఇంటి నెగిటివ్ ఎనర్జీ కూడా చోటు చేసుకుంటుంది దీంతో పలు ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంటారు. ఎప్పుడూ కూడా ఇంట్లో పనికిరాని సామాన్లు ఉండకూడదు. ముఖ్యంగా పాత న్యూస్ పేపర్లు పనికిరాని తాళాలు వంటివి పెట్టకూడదు. అటువంటి ఇంట్లో ఉండడం వలన ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయి. ఇటువంటి వాటిని ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి. లేకపోతే అనవసరంగా దురదృష్టం కలుగుతుంది. సమస్యలు కలుగుతాయి.

do not keep these items in home at any cost

పాత చెప్పులు పనికిరాని చెప్పులు తెగిపోయిన చెప్పులు కూడా ఇంట్లో పెట్టకూడదు. శనివారం నాడు ఇటువంటి చెప్పుల్ని బయటపారేస్తే మంచిది. పాత బట్టల్ని కూడా ఇంట్లో పెట్టుకోకూడదు వాటి వలన నష్టాలు కలుగుతాయి. చిరిగిపోయిన బట్టలు ఇంట్లో పెట్టుకుంటే విఘ్నాలు కలుగుతాయి. చూశారు కదా ఎటువంటి వాటిని ఇంట్లో ఉంచుకోకూడదు అనేది. మరి ఇలా ఫాలో అయితే సమస్యల నుండి బయట పడొచ్చు ఏ బాధ లేకుండా సంతోషంగా ఉండొచ్చు.

Admin

Recent Posts