vastu

మీ వంట గ‌దిలో ఈ మార్పులు చేయండి.. మీకు ఎలాంటి స‌మ‌స్యలు ఉండ‌వు..

ఈ మధ్య ఎక్కువగా వాస్తును నమ్ముతున్నారు.. వాస్తు ప్రకారం ఇంట్లో ప్రతి వస్తువును ఉంచుతున్నారు.. అయితే వంట గదిలో ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచక పోతే ఏదొక చికాకులు, గొడవలు వస్తాయని నిపుణులు అంటున్నారు.. ఇక ఆలస్యం ఎందుకు అసలు వంట గదిలో వాస్తు ప్రకారం ఏ వస్తువును ఏ దిశలో ఉంచితే వాటి ప్రభావాలు మన మీద ఉంటాయనే విషయాన్ని తెలుసుకుందాం..

గ్యాస్ స్టవ్ లు, సిలిండర్లు, మైక్రోవేవ్ ఒవేన్లు, పోస్టర్లు ఇతర ఉపకరణాల తో పాటు వంటగది ఆగ్నేయ భాగంలో ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే వంట చేసే సమయంలో తూర్పు ముఖంగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఇది సానుకూల శక్తిని నిర్ధారిస్తుంది. ఇక వాస్తు శాస్త్రం ప్రకారం గ్యాస్ సిలిండర్, ఓవెన్, వాష్ బేసిన్లు వంటగదిలో ఎప్పుడూ ఒకే ప్లాట్ఫారంపై లేదా ఒక్కదానికొకటి సమాంతరంగా ఉండకూడదు. ఇలా ఉంటే అగ్ని, నీరు రెండు వ్యతిరేక మూలకాలు గా ఉన్నట్టే. దీని వలన ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తాయి..

make these changed in kitchen to get rid of problems

ఇలా కనుక చేస్తే ఇలా చేస్తే కుటుంబ సభ్యుల మధ్య అనుకోకుండా చాలా తగాదాలు వస్తూ ఉంటాయి. అలాగే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించేందుకు రిఫ్రిజిరేటర్ ను నైరుతి దిశలో ఉంచాలి. ఇలా చేస్తే ప్రశాంతమైన వంటగది వాతావరణం ఏర్పడుతుంది. అంతేకాకుండా ధాన్యాలు, ఇతర పదార్థాల నిల్వ వంటగదికి నైరుతి దిశలో ఉంచాలి… అప్పుడే ఎటువంటి గొడవలు జరగకుండా ప్రశాంతంగా ఉంటారు..

Admin

Recent Posts