vastu

మీ ఇంట్లో నెమ‌లి ఈక‌ను ఇలా పెట్టారంటే మీకు ఎలాంటి స‌మ‌స్య‌లు ఉన్నా స‌రే పోతాయి..!

సనాతన ధర్మంలో నెమలి ఈకను చాలా పవిత్రంగా భావిస్తారు. నెమలి ఈకలను చూడగానే మనసులో పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది. శ్రీకృష్ణుడు నెమలి ఈకలను తలపై ధరిస్తాడంటే దీనికి ఎంత ప్రాదాన్యత, పవిత్రత ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. నెమలి ఈక ఇంట్లోకి సానుకూల శక్తిని తెస్తుంది. కష్టాలు తీరిపోతాయని చెబుతారు. నిజంగానే నెమలి ఈక సమస్యలను పరిష్కరిస్తుందా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి? తెలుసుకుంటే.. రాహు దోషం ఉన్నవారికి చాలా ఇబ్బందులు ఉంటాయి. ఈ దోషం వల్ల నిరంతరం ఇబ్బంది పడుతుంటారు. ఇంటికి తూర్పు లేదా వాయువ్య దిశలో నెమలి ఈకను ఉంచాలి. నెమలి ఈకను ఉంచడం వల్ల ఇంట్లో రాహువు ప్రభావం తొలగిపోతుందని నమ్ముతారు.

సనాతన ధర్మంలో నెమలి ఈకలను చాలా పవిత్రంగా భావిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో నెమలి ఈకలను ఉంచడం ఇంటి గొడవలను నివారిస్తుంది. కుటుంబంలో ప్రేమ కూడా పెరుగుతుంది. లక్ష్మి దేవికి శాంతి అంటే చాలా ఇష్టం, అందుకే ఇంట్లో నెమలి ఈకలను భద్రంగా ఉంచాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీ దేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ కుటుంబంపై ఉంటాయి. వ్యాపారంలో ఎదుగుదల ఉండాలని కోరుకుంటే వ్యాపార స్థలంలో లేదా దాని ప్రధాన ద్వారం వద్ద నెమలి ఈకను ఉంచాలి. నెమలి ఈకను తూర్పు దిశలో ఉంచాలని గుర్తుంచుకోండి. ఈ పరిష్కారం వ్యాపారానికి అద్భుతమైన ప్రయోజనాలను తెస్తుంది.

put peacock feather in your home like this to get rid of problems

సంబంధాలు బలపడాలన్నా, బంధాల మధ్య అన్యోన్యత పెరగాలన్నా ఇంట్లో వేణువుతో పాటు నెమలి ఈకలను ఉంచాలి. ఇలా చేయడం ద్వారా సంబంధాలలో ప్రేమ ఎల్లప్పుడూ ఉంటుంది. అయితే ఈ పరిహారం చేసేటప్పుడు, వేణువు ముఖం తూర్పు దిశలో ఉండేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

Admin

Recent Posts