viral news

రావణుడిని చంపింది ఎవరు.. టీచర్ ప్రశ్నకు ఈ కుర్రాడి సమాధానం వింటే పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకోవాల్సిందే..

పిల్లల ఆల్లరి మాటలు వింటే ఎంతో నవ్వు వస్తుంటుంది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక అలాంటి ఎన్నో ఫన్నీ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. క్లాస్ రూమ్‌లో టీచర్ అడిగిన ప్రశ్నకు ఓ కుర్రాడి సమాధానం వింటే నవ్వుకోవాల్సిందే.

చిన్న పిల్లల అల్లరి, కల్మషం లేకుండా అమాయకంగా మాట్లాడే మాటలు చాలా మందికి నవ్వు తెప్పిస్తాయి. పిల్లలతో కాసేపు గడిపితే ఈ ప్రపంచాన్నే మర్చిపోవచ్చు అని చెబుతుంటారు. వాళ్ల ఆల్లరి మాటలు వింటే ఎంతో నవ్వు వస్తుంటుంది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక అలాంటి ఎన్నో ఫన్నీ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. క్లాస్ రూమ్‌లో టీచర్ అడిగిన ప్రశ్నకు ఓ కుర్రాడు చెప్పిన సమాధానం వింటే నవ్వుకోవాల్సిందే. రావణుడిని చంపింది ఎవరు అని పిల్లలను టీచర్ అడిగితే.. ఆ కుర్రాడు అమాయకంగా చెప్పిన సమాధానం చాలా మందిని ఆకట్టుకుంటోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

boy funny reply about who killed ravana

@aachary_shailendr0216 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. క్లాస్‌రూమ్‌లో టీచర్ ఓ బాలుడిని పిలిచి రావణుడిని చంపింది ఎవరు అని అడిగారు. దానికి ఆ కుర్రాడు భయపడుతూ.. నేను కాదు సర్. ప్రమాణపూర్వకంగా చెబుతున్నాను. నేను మంచినీళ్లు తాగడానికి వెళ్లాను అని చెప్పాడు. పక్కనే ఉన్న మరో కుర్రాడిని చూపించి.. నేను చంపలేదు. ఆ కుర్రాడే చంపాడు అని నమ్మకంగా చెప్పాడు. ఆ కుర్రాడి సమాధానం విని టీచర్ అవాక్కయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 2 కోట్ల మంది వీక్షించారు. 22 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు చేశారు. రావణుడిని నేను కూడా చంపలేదు, బ్యాక్ బెంచ్ స్టూడెంట్, ఆ కుర్రాడు ప్రమాణం చేస్తున్నాడు.. నిజంగానే చంపి ఉండడు, ఎంత అమాయకంగా చెబుతున్నాడో, రావణుడిని నేను చంపాను అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

Admin

Recent Posts