viral news

న‌న్ను బాగా ఆలోచింప‌జేసిన ఫోటో ఇది.. అంత‌గా ఏముంది ఇందులో..?

ఈరోజు నా మొబైల్ ఫోన్‌లో ఒకపాత ఫోటో కనిపించింది, దానిని నెటిజ‌న్ల‌కు షేర్ చేయకుండా ఉండలేక పోతున్నాను! సుమారు 6-7 సంవత్సరాల క్రితం నేను రాజమండ్రి వెళ్ళడానికి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాను. అక్కడ ప్రధాన ద్వారం కుడి వైపున నిర్మించిన కొత్త టాయిలెట్‌ To Pay నా దృష్టిని ఆకర్షించింది. నేను ఒకసారి చూడ్డానికని మూత్ర విసర్జన కై లోపలి కెళ్ళాను. అది కొన్ని మూత్ర విసర్జన సీట్లు & మరికొన్ని టాయిలెట్‌లతో కూడిన చిన్న హాలు….బాగా వెలుతురుంది. బాగా నిర్వహించబడుతోంది…

అప్పుడు నేను గమనించిన ఒక విషయం ఏమిటంటే- వినియోగ దారులు నిలబడి చేసే మూత్ర విసర్జన సీట్ల క్రింద, టైల్స్ మీద నేల అసౌకర్యంగా తడిగా ఉంది! ఎందువల్ల? వాడకం దారులు ఆ బేసిన్ కి దగ్గరగా నిలబడకుండా, కొంచెం దూరంగా నిలబడి కాని చ్చేయడం వలన పక్కలకు చింది గచ్చు మీద పడుతోంది. దీని వల్ల అక్కడ పనిచేసే సిబ్బంది లేదా అక్కడి అటెండర్ తరచుగా అక్కడ గచ్చు ను తుడవాల్సి వస్తోంది.

this photo attracted me very much what is in it

కాబట్టి వారు యూరినల్ బేసిన్ కు చాలా దగ్గరగా నిలబడమని వినియోగదారులను అభ్యర్థిస్తూ ఒక బోర్డును ప్రదర్శించాలని నిర్ణయించుకున్నారు. ఆ బోర్డు లోని సందేశం నాకు నచ్చి ఒక ఫోటో తీసి దాని సంగతి మరిచిపోయాను. ఆ ఫోటో ఇక్కడ చూపించాను. ఈ నోటీసు బోర్డును రూపొందించిన వ్యక్తి హాస్య చతురతను నేను అభినందించకుండా ఉండలేక పోతున్నా.

Admin

Recent Posts