యోగా

అపాన ముద్ర వేయ‌డం ఎలా.. దీంతో క‌లిగే లాభాలు తెలుసా..?

యోగాలో అనేక విధానాలు ఉన్నాయ‌న్న సంగ‌తి తెలిసిందే. అందులో ముద్ర‌లు వేయడం కూడా ఒక‌టి. చేతి వేళ్ల‌తో వేసే ఈ ముద్ర‌లు మ‌న శ‌రీరంపై ప్ర‌భావాన్ని చూపిస్తాయి. ప‌ద్మాస‌నంలో ఉండి ఈ ముద్ర‌ల‌ను వేయాల్సి ఉంటుంది. ఉద‌యం ప‌ర‌గ‌డుపునే ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణంలో ధ్యానం చేస్తూ ఈ ముద్ర‌ల‌ను వేస్తే మంచి ఫ‌లితం ఉంటుంద‌ని యోగా నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ ముద్ర‌ల్లో అపాన ముద్ర అని ఒక‌టి ఉంది. దీన్ని ఎలా వేయాలి, దీంతో ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ముద్ర వేసే విధానము.. బొటనవేలు కొనతో మధ్యవేలు, ఉంగరం వేలు కొనలను కలపాలి. మిగిలిన 2 వేళ్ళు నిలువుగా ఉంచాలి.

what is apana mudra and its benefits

అపాన ముద్ర ప్రయోజనాలు : విసర్జన అవయవాల పనితీరును మెరగుపడుతుంది. మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, చర్మం ఆరోగ్యవంతంగా తయారవుతాయి. లివర్, గాల్ బ్లాడర్, ముక్కుదిబ్బడ, మూసుకు పోవటం, గ్యాస్ ఇబ్బందులు తొలగిపోతాయి. స్త్రీలలో నెలసరి సవ్యంగా అవుతుంది.

ఎంతసేపు ముద్ర వేయాలి: టైమ్ లిమిట్ లేదు. ఎంత ఎక్కువ సేపు చేస్తే అంత ప్రయోజనకరం. గమనిక: వాంతులు, విరోచనాలు అయ్యేవారు చేయ కూడదు.

Admin

Recent Posts