మీ ముఖం ఉబ్బినట్లు కనిపిస్తోందా.. అయితే ఈ వ్యాధి కావచ్చు..!!
మన శరీరంలో ఉన్న అవయవాల్లో కాలేయం అనేది చాలా సున్నితమైన అవయవం. శరీరంలో చాలా పనులను కాలేయం నిర్వహిస్తుంది. ముఖ్యంగా హానికరమైన పదార్థాలను బయటకు పంపడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. కార్బోహైడ్రేట్, ప్రోటీన్లు, కొవ్వులను విచ్చినం చేస్తుంది. ఖనిజ లవణాలు వంటి ముఖ్యమైన పోషకాలను నిల్వ చేస్తుంది. రక్తం గడ్డ కట్టడంలో సహాయపడే ప్రోటీన్ లను ఉత్పత్తి చేస్తుంది. ఇలాంటి పనులు చేసే కాలేయాన్ని జాగ్రత్తగా చూసుకోకపోతే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఫ్యాటీ లివర్ సమస్య…